Thursday, April 25, 2024

పది విద్యార్థులకి పౌష్టికాహారం పంపిణి

దుగ్గిరాల ఫిబ్రవరి 20(ప్రభ న్యూస్) – విద్యార్థులే రేపటి భవిష్యత్ నిర్దేశకులని వారికీ పౌష్టికాహారం అవసరమని జడ్పీటిసి సభ్యులు మేకతోటి అరుణ అన్నారు. మండలంలోని పలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల లో పౌష్టికాహారాన్ని జడ్పీటిసి అరుణ , యంపిపి దానబోయిన సంతోష రూపవాణి.పంపిణి చేశారు. దుగ్గిరాల, పెడకొండూరు, పెదపాలెం , రేవెంద్రపాడు, ఈమని, పెనుమూలి గ్రామాల్లో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లోని 10 వ తరగతి విద్యార్థులకు పౌష్టికాహారం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్బంగా అరుణ మాట్లాడుతూ పది తరగతి లో మంచి ఫలితాలు రావాలని ఆకాంక్షించారు.ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలొ విద్యా వ్యవస్థలో సంచలన మార్పులు తీసుకువచ్చారని , వాటిని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకి సూచించారు. కార్యక్రమంలో గ్రామల సర్పంచులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.ఈమని హై స్కూల్ లో డిప్యూటీ ఈఓ ఎం.నిర్మల విద్యార్థులకి పలు అంశాలని వివరించారు.పాఠశాల చైర్మన్ బి.కోటయ్య, హెచ్ యం ఏడుకొండలు ఉపాధ్యాయులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement