Saturday, May 18, 2024

సిరిపురం పాఠశాలను తనిఖీ చేసిన విద్యాశాఖ కమిషనర్ భాస్కర్

కొల్లిపర, ఫిబ్రవరి 17, ప్రభా న్యూస్:-రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థిని విద్యార్థుల కొరకు మెరుగైన విద్యా విధానాన్ని అమలు చేస్తుందని విద్యాశాఖ కమిషనర్ కే భాస్కర్ అన్నారు. మండల పరిధిలోని సిరిపురం గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలను శుక్రవారం విద్యాశాఖ కమిషనర్ కే భాస్కర్ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలలో పనిచేసే ఉపాధ్యాయులు గ్రామీణ ప్రాంత ంలో నివసించే ప్రజలకు ప్రభుత్వం పేదల అభ్యున్నతి కొరకు విద్య వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొచ్చిందని ప్రజలకు తెలియజేస్తూ, పాఠశాలలో మరింత మంది విద్యార్థుల సంఖ్యను పెంచాలని చెప్పారు. గ్రామంలోని ఎంపీపీ ఎస్ ఎల్ ఈ స్కూల్ కు డెమో కొరకు ప్రహరీ నిర్మాణం చేయడానికి అనుమతులు కల్పించారు. ప్రభుత్వం పాఠశాలలను అభివృద్ధి లో భాగంగా నాడు నేడు ద్వారా గ్రామంలోని పాఠశాలకి సాంక్షన్ అవకాశాన్ని కల్పిస్తామని చెప్పారు. ఉపాధ్యాయుల పనితీరు విద్యార్థిని విద్యార్థుల ప్రతిభను ఆయన పరిశీలించారు అన్ని రకాల రికార్డులను సక్రమంగా నమోదు చేయాలని ఆదేశించారు. ఈ తనిఖీలలో డీఈవో పి శైలజ ,సమగ్ర శిక్షణ అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ విజయలక్ష్మి, జిల్లా ఎంఐఎస్ కోఆర్డినేటర్ జె రవి, ఎస్ ఈ శివ నాగేశ్వరరావు, ఈ ఈ జి సుధాకర్, ఎంఈఓ ఎస్ వెంకటేశ్వర్లు, మండల ఎంఐఎస్ కోఆర్డినేటర్ ఎస్ రమేష్, ఏఈ సిహెచ్ నాగేంద్ర, స్కూల్ హెచ్ఎం సదా లక్ష్మీదేవి, సిఆర్పిఎస్ పిడపర్తి రమేష్ బాబు తదితరులు వెంట ఉన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement