Friday, May 3, 2024

దౌర్జన్యాలు.. దాష్టీకాలు మధ్య పోరాటం చేశాం – ప‌వ‌న్ క‌ల్యాణ్..

అమరావతి, : దౌర్జన్యాలు, దాష్టీకాల మధ్య ఒక ఆశయాన్ని నమ్మి దాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి గుండె ధైర్యం కావాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంత మంది నిల బడ్డాం అన్న దానికంటే ఏ స్థాయిలో పోరాటం చేశామ న్నదే ముఖ్యమని స్పష్టం చేశారు. మహిళ లు, యువకులు బలంగా నిలబడి విజ యం సాధించారని తెలి పారు. జనసేన పార్టీ తరఫున కార్పొరేషన్‌, మున్సిపల్‌ ఎన్నికల్లో విజయం సాధించిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో ఆయన టె లీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సం దర్భంగా గెలుపొందిన, పోటీ చేసిన అభ్యర్ధు లకు అభినందనలు తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఎదురైన అనుభవాలను అభ్యర్ధుల ద్వారా తెలుసుకున్నారు. అనంతరం పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూమై దుకూరు లాంటి ప్రాంతాల్లో ఎలాంటి ఒత్తిళ్ళు ఉంటాయో.. అక్కడ నిలబడి ఒక వార్డు విజయం సాధించడం ఎంత కష్టమో నాకు తెలుసు. అలాంటి పరిస్థితులు ప్రత్యక్షంగా చూశాను. ఈ తరహా విపత్కర పరిస్థితులు ఇప్పుడు ప్రతి జిల్లాలోనూ ఉన్నాయి. ఇంతటి కష్టసాధ్యమైన సమయంలో ఎన్నికల్లో పోటీ- చేసి గెలిచిన ప్రతి ఒక్కరికీ, పోరాటంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ అభినందనీయులు. కార్పొరేషన్లలో పోటీ చేసిన వార్డుల్లో 14 శాతం ఓటు సాధించామని, మున్సిపాలిటీ ల్లో 13.4 శాతం ఓట్లు సాధించామని, రాజకీయ పార్టీగా బలంగా, స్థిరంగా ముందుకు వెళ్తున్నామని, ఈ గెలుపు రాబోయే విజయానికి సంకేతమని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ మాట్లాడుతూ ‘రాజకీయ ప్రస్థానంలో ఇంత సుదీర్ఘ ప్రయాణం సామాన్య విషయం కాదు. ప్రత్యర్ధులు చేసే దుష్ప్రచారాన్ని, వ్యక్తిగత విమర్శలను తట్టు-కుని పవన్‌ కల్యాణ్‌ పార్టీని ధైర్యంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. అంతా అదే స్ఫూర్తితో అందరం ముందుకు వెళ్దాం. రాబోయే రెండు రోజులు గెలిచిన అభ్యర్ధులంతా వ్యక్తిగత భద్రత పట్ల శ్రద్ద వహించాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement