Tuesday, May 14, 2024

ISRO | నేడే జీఎస్‌ఎల్‌వీ -ఎఫ్‌14 కౌంట్‌డౌన్‌..

శ్రీహరికోట, ప్రభ న్యూస్‌: శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ నెల 17న చేపట్టనున్న జీఎస్‌ఎల్‌వీ -ఎఫ్‌14 ప్రయోగానికి శాస్త్రవేత్తలు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. షార్‌లోని రెండవ ప్రయోగ వేదికపై నింగికెక్కుపెట్టిన బాణంలా ఉన్న జీఎస్‌ఎల్‌వీ -ఎఫ్‌14 రాకెట్‌కు సంబంధించిన రిహార్సల్‌ను గురువారం శాస్త్రవేత్తలు విజయవంతంగా నిర్వహించారు.

ఈ నివేదికలను ఎంఆర్‌ఆర్‌ (మిషన్‌ రెడినెస్‌ రివ్యూ) సమావేశాన్ని నిర్వహించిన శాస్త్రవేత్తలు జీఎస్‌ఎల్‌వీ -ఎఫ్‌14 ప్రయోగానికి సిద్ధంగా ఉన్నట్లు గుర్తించారు. అనంతరం లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు ప్రయోగానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ క్రమంలో శుక్రవారంమధ్యాహ్నం 2.05 గంటలకు ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ను ఇస్రో శాస్త్రవేత్తలు ప్రారంభించనున్నారు. 27.30 గంటల పాటు కొనసాగనున్న కౌంట్‌డౌన్‌ శనివారం సాయంత్రం 5.35 గంటలకు 0కు చేరుకోగానే నిప్పులు చిమ్మతూ నింగిలోకి జీఎస్‌ఎల్‌వీ -ఎప్‌14 దూసుకెళ్లనుంది.

జీఎస్‌ఎల్‌వీ -ఎఫ్‌14 రాకెట్‌ ద్వారా ఇన్‌శాట్‌ 3డీఎస్‌ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. వాతావరణ అంచనాతో పాటు విపత్తుల హెచ్చరికలు, భూమి, సముద్ర ఉపరితల పర్యవేక్షణ కోసం ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ప్రకృతి విపత్తులను పసిగట్టగలిగేలా ఇన్‌శాట్‌ 3డీఎస్‌ను రూపొందించారు. భూమికి 36,786 కిలోమీటర్ల ఎత్తులోని జియో స్టేషనరీ ఆర్బిట్‌ నందు ఈ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement