Sunday, October 6, 2024

Girls Fight:  సెల్ఫీ కోసం వివాదం… పొట్టుపొట్టు కొట్టుకున్న‌యువ‌తులు

ఎక్కడైనా వెళ్తే.. అక్కడ ఫేమస్‌ అయిన ప్రాంతంలో సెల్ఫీలు, ఫొటోలు తీసుకోవడం ఇప్పుడు పెద్ద ట్రెండ్‌గా మారింది.. అయితే, ఇది శృతిమించి కొన్ని ప్రాంతాల్లో గొడవలకు కూడా దారి తీస్తోంది. తాజాగా గుంటూరులోని గాంధీ పార్క్‌లో సెల్ఫీల విషయంలో చోటు చేసుకున్న వివాదం.. తీవ్ర ఘర్షణకు దారి తీసింది.. రెండు గ్రూపులుగా విడిపోయి యువతులు పరస్పరం దాడులు చేసుకున్నారు.

గాంధీ పార్క్‌లో సెల్ఫీలు తీసుకునే క్రమంలో రెండు గ్రూపులు పోటీ పడ్డాయి.. అది కాస్తా మాటామాటా పెంచి వాగ్వాదానికి దారితీసింది.. ముందు సెల్ఫీలు తామే దిగాలని , తాము సెల్ఫీలు దిగుతున్నప్పుడు అడ్డు తప్పుకోవాలని యువతుల మధ్య రాజుకున్న వివాదం.. శృతిమంచిపోయింది.. దీంతో.. ఒకరిపై ఒకరు పిడి గుద్దులు గుద్దుకున్నారు యువతులు.. సెల్ఫీల కోసం ఇలా ఆడపిల్లలు ఫైటింగ్ కు దిగడంతో స్థానికులంతా నోరువెళ్లబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది.. అయితే, ఎలాగూ స్మార్ట్‌ ఫోన్‌ చేతిలో ఉంది.. కాస్త వెరైటీగా ఏది కనిపించనా వదలడంలేదు.. ఈ అమ్మాయిల ఘర్షణను కూడా ఓ వ్యక్తి తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి.. సోషల్‌ మీడియాలో వదలడంతో.. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారిపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement