Sunday, May 19, 2024

గ్రామ వార్డు, సచివాలయ ఉద్యోగుల శ్రేయస్సే లక్ష్యం : జానీ పాషా

అమరావతి, ఆంధ్రప్రభ : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమమే తమ ఫెడరేషన్‌ లక్ష్యమని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఫెడరేషన్‌ అద్యక్షుడు ఎండీ జానీపాషా తెలిపారు. ఆదివారం రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒకేసారి వేలాది మందికి ఉపాధి కల్పించడంతోపాటు వేలాది మందికి ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేసినందుకు ఫెడరేషన్‌ తరపున ముఖ్యమంత్రి వర్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానం చేశామని వెల్లడించారు. ఉద్యోగుల కుటు-ంబ సభ్యులకు కారుణ్య నియామకాలు కల్పించాలని, సచివాలయ ఉద్యోగులకు బదిలీలు కల్పించాలని ప్రభుత్వాన్ని, సచివాలయాల శాఖ అధికారులను అభ్యర్థించామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులకు అవసరమైన న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం మరియు సచివాలయ వ్యవస్థ బలోపేతం కోసం ఫెడరేషన్‌ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.

ఏపీఎన్‌ఓస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు మరియు గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ గౌరవ అధ్యక్షులు బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ, సచివాలయం ఉద్యోగులు అందరు ఎన్‌జీఓస్‌ కుటు-ంబ సభ్యులేనని, సచివాలయం ఉద్యోగుల కష్ట, సుఖల్లోనూ తాము పాలుపంచుకుంటామన్నారు. గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులు ఫెడరేషన్‌ సభ్యత్వంతో పాటు- ఎన్‌జీఒస్‌ సభ్యత్వం తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం )ఎన్‌. చంద్రశేఖర్‌ రెడ్డి మాట్లాడుతూ, సచివాలయం ఉద్యోగులకు ఏ సమస్య ఉన్న ఫెడరేషన్‌ తరుపున ప్రభుత్వానికి తెలియజేసి వాటి పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలన్నారు. ఆవిధంగాఉద్యోగులకు మేలు చేయాలి అని సూచించారు. సచివాలయం ఉద్యోగుల కోసం జరిపిన సభలలో ఈ సమావేశం అతి పెద్దదిగా పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఏపీఎన్‌జీఓస్‌ ప్రధాన కార్యదర్శి కేవీశివారెడ్డి, పశ్చిమ కృష్ణా అధ్యక్షులు విద్యాసాగర్‌, గ్రామ వార్డు సచివాలయఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీ హరింద్ర, జిల్లా కమిటీ-ల సమన్వయకర్త యస్‌ హరి, ప్రాంతీయ కమిటీ-ల సమన్వయకర్త బీ పుల్లారావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజారావు, మహిళా నాయకులు బీ శ్వేత, అర్చన, సుజాతా, పీ శ్రావణి మరియు అన్ని జిల్లాల అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శులు, జిల్లా నాయకులు, అన్ని జిల్లాలు నుండి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement