Monday, May 6, 2024

AP : గీతాంజ‌లి ఆత్మ‌హ‌త్య…ఒక‌రి అరెస్ట్

టిడిపి సోషల్‌ మీడియా కార్యకర్త పసుమర్తి రాంబాబును తెనాలి పోలీసులు విజయవాడలో అదుపులోకి తీసుకున్నారు. గురువారం తెల్లవారుజామున వచ్చిన పోలీసులు అజిత్‌సింగ్‌ నగర్‌లోని ఇంటి నుంచి అతడిని తీసుకెళ్లారు.

కాగా, సోషల్‌ మీడియాలో వేధించిన సైకోలను వదల్లొద్దంటూ డిమాండ్‌ బలంగా వినిపించింది. ఏపీ పోలీసులు కూడా ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. దర్యాప్తు ముమ్మరం చేసి పసుమర్తి రాంబాబును అరెస్ట్‌ చేశారు. గీతాంజలిపై రాంబాబు సోషల్‌ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెట్టినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో అత‌డిని అదుపులోకి తీసుకుని తెనాలి స్టేషన్‌కు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement