Friday, May 3, 2024

గంజాయి అక్రమంగా తరలిస్తున్న నలుగురు అరెస్ట్..

ఉంగుటూరు, (ప్రభా న్యూస్)- గంజాయిని అక్రమంగా తరలిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు గన్నవరం డిఎస్పి ఆర్ జి జై సూర్య తెలిపారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు పోలీస్ స్టేషన్ లో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ జాషువా పర్యవేక్షణలో గన్నవరం డిఎస్పీ జై సూర్య నేతృత్వంలో హనుమాన్ జంక్షన్ సిఐ ఏ నవీన్ నరసింహమూర్తి ఆదేశాలతో ఆత్కూర్ ఎస్సై టి సూర్య శ్రీనివాస్ తన సిబ్బందితో గన్నవరం మండలం చిన్న ఆవుటపల్లి వద్ద 16వ నెంబర్ జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీలను నిర్వహించిన‌ట్టు తెలిపారు. ఈ తనిఖీల్లో ఏపీ 39 యూకే 9957 గూడ్స్ ఆటోను తనిఖీ చేయగా ఆటోలో 304 కేజీల గంజాయిని పట్టుబడినట్లు డీఎస్పీ చెప్పారు.

దీంతో ఆటోలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న నలుగురు వ్యక్తులు చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన మల్లెల రాజమ్మ మల్లెల వెంకటరమణ చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె పెద్దతిప్ప సముద్రం కు చెందిన ఆవుల సంతోష్ అలియాస్ శివ ఆవుల లక్ష్మి అలియాస్ నందినీలను అదుపులోకి తీసుకుని వారి వద్ద నాలుగు సెల్ ఫోన్లు గూడ్స్ ట్రక్ ఆటోను గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నిందితులను విచారించగా అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి నుంచి చిత్తూరు జిల్లా పుంగనూరుకు తరలిస్తున్నట్లు తెలిపారు. అన్నారు గంజాయిని ఆటోను సీజ్ చేసి నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement