Friday, October 11, 2024

Rain Alert: తెలంగాణ‌లో నాలుగురోజులు…ఏపీలో మూడు రోజుల వ‌ర్ష సూచ‌న

తెలంగాణ‌లో మరో నాలుగు రోజులు వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, రాజన్న-సిరిసిల్ల, పెద్దపల్లి, జనగాం, జగిత్యాల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది.
అల్పపీడన ప్రభావంతో ఏపీలోను వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

మూడు రోజులపాటు వర్షాలు పడతాయని వెల్లడించింది. అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్‌, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, పార్వతీపురం మన్యం, పశ్చిమగోదావరి, ఏలూరు, నెల్లూరు, నంద్యాల, కడప, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉత్తరకోస్తా, యానాంలో తేలికపాటి వర్షాలు రెండు రోజుల పాటు, కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement