Tuesday, May 14, 2024

AP : జగన్ సమక్షంలో వైసిపిలో చేరిన మాజీ ఐఎఎస్ అధికారి ఇంతియాజ్..

సీనియర్‌ ఐఏఎస్ మాజీ అధికారి ఏఎండీ ఇంతియాజ్ నేడు వైసిపిలో చేరారు.. తాడేప‌ల్లి కార్యాల‌యంలో జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మంలో ఆ పార్టీ అధినేత జ‌గ‌న్ ఆయ‌న‌కు కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు.. ఇక క‌ర్నూలు నుంచి ఆయ‌న ఎన్నిక‌ల బ‌రిలోకి దిగ‌నున్న‌ట్లు స‌మాచారం. కాగా ఆయ‌న బుధవారం ఉదయం తాను తన పదవికి స్వచ్చంధంగా రాజీనామా చేస్తున్నట్లు దరఖాస్తు చేస్తూ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆ వెంట‌నే అయ‌న రాజీనామాను అంగీక‌రిస్తూ జీవో-477 ను విడుద‌ల చేసింది.

- Advertisement -

ఇది ఇలా ఉంటే ఏఎండీ ఇంతియాజ్‌ డిపూటీ కలెక్టర్‌ స్థాయి నుంచి ఐఏఎస్‌గా పదోన్నతి పొందారు. అనంతరం 2018కి ముందు నెల్లూరు, ఆ తర్వాత గుంటూరు జాయింట్‌ కలెక్టర్‌గా పనిచేశారు. ఇక 2019, ఫిబ్రవరి 8న అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రభుత్వంలో కృష్ణా జిల్లా కలెక్టర్‌గా పోస్టింగ్‌ పొందారు. అక్కడే 2021, జూన్‌ వరకు ఆ పోస్టులో కొనసాగారు. గన్మోహన్ రెడ్డి సీఎం అయిన తరువాత ఇంతియాజ్‌ ను ఆ పదవి నుండి తప్పించి మైనారిటీ సంక్షేమశాఖ స్పెషల్‌ సెక్రెటరీగా నియమించారు. ఆతరువాత మైనారిటీ సంక్షేమశాఖ కమిషనర్‌, ఆ శాఖ స్పెషల్‌ సెక్రెటరీగా రెండు బాధ్యతల్లో ఉన్న ఇంతియాజ్‌కు వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ పదవిని కూడా అప్పగించడం జరిగింది. చివ‌ర‌కు ఆయ‌న ఆ పోస్ట్ లో ఉండ‌గానే స్వ‌చ్చంద ప‌ద‌వీ విర‌మ‌ణ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement