Friday, April 26, 2024

Maha Shivaratri: శ్రీశైలం మల్లన్నకు, అమ్మవారికి పుష్ప పల్లకీ సేవ

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీశైలంలో ఆదివారం రాత్రి స్వామి, అమ్మవార్లకు పుష్పపల్లకీసేవ నిర్వహించారు. స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి అక్కమహాదేవి మండపంలో ఉంచారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత వివిధ పుష్పాలతో అలంకరించిన పుష్పపల్లకి మేళతాళాలతో స్వామి అమ్మవార్లను తీసుకోచ్చి ఊరేగింపు చేశారు. ఈ విశేష సేవలో ఎర్రబంతి , పసుపు బంతి , తెల్లచేబంది , పసుపు చేబంతి , కనకాంబరాలు , డచ్స్ , అశోక పత్రాలు , కాగడాలు , గ్లాడియేలస్ , అస్పెర్ గ్రాస్ , జబ్రా , కార్నేషన్ , ఆర్కిడ్స్ , నందివర్ధనం , గరుడవర్ధనం మొదలైన పలు రకాల పుష్పాలను వినియోగించారు. కాగా, నవాహ్నిక దీక్షతో పదకొండు రోజుల పాటు నిర్వహించే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఆరవ రోజైన ఆదివారం ఉదయం స్వామిఅమ్మవార్లకు విశేష పూజలు చేశారు. తర్వాత యాగశాలలో చండీశ్వర స్వామికి ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement