Sunday, June 16, 2024

అనంతపురం జిల్లా బోయిరెడ్డిపల్లెలో ఫైర్ యాక్సిడెంట్‌..

అనంతపురం జిల్లాలోని యాడికి మండలం బోయిరెడ్డిపల్లెలో ఫైర్ యాక్సిడెంట్ జ‌రిగింది. పెన్నా సిమెంట్‌ ఫ్యాక్టరీలోని కోల్‌మిల్‌ వెనుక భాగంలో ఒక్క‌సారిగా మంటలు చెలరేగాయి. బొగ్గుతో మండే గొట్టం హీట్‌ పెరగడంతో పేలుడు జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. పేలుడు సమయంలో కార్మికులు టీ బ్రేక్‌కు వెళ్లడంతో పెను ప్రమాదం త‌ప్పింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement