Friday, May 17, 2024

రాష్ట్రంలో కొన‌సాగుతున్న‌ ఫీవర్‌ సర్వే..

ఒమిక్రాన్‌ రాష్ట్రంలో విస్తరిస్తున్న నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమై ఫీవర్‌ సర్వేను చేపట్టింది. గత నెల 20వ తేదీన ప్రారంభమైన సర్వే 40 శాతం మేర పూర్తి అయింది. వలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు ఇంటింటికీ తిరిగితే క్షేత్రస్థాయిలో జ్వరపీడితులను గుర్తించే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1.5 కోట్ల మందికి పైగా వైద్య సిబ్బంది సర్వే చేశారు. వారంలో 5 రోజుల పాటు క్షేత్రస్థాయిలో సిబ్బంది పర్యటిస్తూ కరోనా లక్షణాలు ఉన్న వారికి ఇంటి వద్దే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 4 వేల 500 మందికి పైగా కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వారిని గుర్తించి వారందరికీ ర్యాపిడ్‌ టెస్టులతో పాటు ఆర్టీపీసీఆర్‌ పరీక్షలను కూడా నిర్వహించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఈ సర్వేలో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు మాత్రమే నమోదయింది. ఇప్పటికే 34 సార్లు ఫీవర్‌ సర్వేను ప్రభుత్వం నిర్వహించింది. ప్రస్తుతం 35వ విడత కొనసాగుతోంది. కరోనా మొదటి, రెండో దశల్లో 14 సార్లు ఫీవర్‌ సర్వేను వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించింది. మరో రెండు వారాల్లోగా ప్రస్తుతం జరుగుతున్న ఫీవర్‌ సర్వే పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement