Monday, October 7, 2024

AP : కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం… అక్కడిక్కడే నలుగురు మృతి

కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పాదాలమ్మ గుడి వద్ద 16వ నెంబర్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. నలుగురు వ్యక్తులు స్పాట్‌లోనే ప్రాణాలు విడిచారు.

ప్రత్తిపాడు వద్ద ఆదివారం అర్ధరాత్రి పంక్చర్‌ అయిన లారీ టైర్‌ను నలుగురు వ్యక్తులు మారుస్తుండగా, ఈ క్రమంలో అతి వేగంతో దూసుకొచ్చిన ఆర్టీసీ సూపర్‌ లగ్జరీ బస్సు వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను దాసరి ప్రసాద్‌, దాసరి కిషర్‌, క్లీనర్‌ నాగయ్య, స్థానికుడు రాజుగా గుర్తించారు.. మృతుల్లో ముగ్గురు బాపట్ల జిల్లా నక్క బొక్కలపాలెంకు చెందినవారు కాగా.. రాజు అనే యువకుడిది ప్రత్తిపాడుగా గుర్తించారు. ఇక, సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement