Friday, October 4, 2024

Krishna : గుండుపాలంలో రైతుల ధ‌ర్నా

మచిలీపట్నం మండలం గుండుపాలెం గ్రామంలో రైతులు ధర్నా నిర్వహిస్తున్నారు. సుమారు వందకు పైగా బందరుకోట కు చెందిన గేదలు రాత్రి తమ పంటపొల పై పడి పంటలను నాశనం చేస్తున్నాయ‌ని ఆరోపిస్తున్నారు. ఈ విషయం తాలూకా పోలీసులకు, అధికారులకు తెలియజేసిన స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు.

ఇప్పటివరకు అరకొరా సాగునీటి తో పంటలను కాపాడుకున్నామని, నోటికొచ్చిన పంటను ఇప్పుడు గేదెల పాలు చేయాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు సంబంధిత గేదెల యాజమానుల పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement