Saturday, May 11, 2024

మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి హౌస్ అరెస్ట్

ఏపీలో మైనింగ్ అక్రమాలపై నిజ నిర్ధారణ చేయాల‌ని టీడీపీ బృందం సిద్ధమైంది. దీంతో అప్రమత్తమై పోలీసులు ప‌లు జిల్లాల్లో టీడీపీ నేతలను ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేస్తున్నారు. కర్నూలు పర్యటనకు వెళుతున్న అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. అయితే, ఈ విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఇంటి వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు కార్యకర్తల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement