Thursday, April 25, 2024

Breaking: ఎమ్మెల్యే పదవికి రాజీనామా యోచనలో బాలినేని

ఏపీలో కొత్త మంత్రివర్గ విస్తరణ వైసీపీలో చిచ్చు రాజేసింది. పదవులు కోల్పోయిన తాజా మాజీ మంత్రులు కొత్త కేబినెట్ లో చోటు దక్కకపోవడంపై రగిలిపోతున్నారు. ఇప్పటికే ఇప్పటికే మాజీ హోంహంత్రి మేకతోటి సుచరిత తన పదవికి రాజీనామా చేశారు. తాజాగా మంత్రి పదవి దక్కలేని తీవ్ర అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే యోచనలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారు. మంత్రివర్గంలో మళ్లీ చోటు కల్పించకపోవడంపై మనస్తాపం చెందారు.

మరోవైపు బాలినేనికి మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడంపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. బాలినేనికి మద్దతుగా ఆయన అనుచరులు రాజీనామా బాటపట్టారు.  సంతమాగులూరు మండల పరిషత్ అధ్యక్ష పదవికి వెంకటరెడ్డి రాజీనామా చేశారు. ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవికి కొటారి రామచంద్రరావు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement