Sunday, October 6, 2024

ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి.. మంత్రి పెద్దిరెడ్డి

అనంతపురం, ఆగస్టు 5 : అధికారులు అందరూ బాధ్యతగా తీసుకుని ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. అనంతపురం పర్యటనలో ఉన్న మంత్రి కళ్యాణదుర్గం, గుంతకల్ నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా ఇంచార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు మంత్రి ఉషశ్రీ చరణ్, ఎమ్మెల్యేలు వెంకటరామిరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, ఎంపి తలారి రంగయ్య, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, కలెక్టర్ ఎం.గౌతమి, ఎస్పీ శ్రీనివాస రావు, తదితరులు హాజరయ్యారు.

ఈసందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ… రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో సమీక్షలు నిర్వహించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారన్నారు. తద్వారా నియోజకవర్గాల వారీగా జరగాల్సిన పనులపై ప్రత్యేక దృష్టి ఉంటుందన్నారు. ప్రభుత్వ పరంగా అవసరమైన నిధులు అందించడం జరుగుతుందన్నారు. అందుకే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నేడు కళ్యాణదుర్గం, గుంతకల్ నియోజకవర్గం పై సమీక్ష చేస్తున్నామన్నారు. ఎన్నికలు కూడా సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే చేసిన అభివృద్ది మరింత అభివృద్ధిని జోడించాలన్నారు. ప్రజాప్రతినిధులు కూడా ప్రాధాన్యతల వారీగా ప్రజలకు అవసరమైన పనులు చేపట్టాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement