Sunday, April 28, 2024

Election Code – ఐటీ ఫోకస్!​ లక్ష దాటితే లెక్క చెప్పాల్సిందే

కొత్త రూల్స్ తీసుకొచ్చిన ఎలక్షన్​ కమిషన్​
ఎన్నిక‌ల నిబంధ‌న‌లు మ‌రింత క‌ఠినం
బ్యాంకు లావాదేవీల‌పైనా పెద్ద ఎత్తున నిఘా
అధిక ట్రాన్షాక్ష‌న్ అకౌంట్ల డీటెయిల్స్ సేక‌ర‌ణ‌
ఐటీ శాఖకు బ్యాంకుల నుంచి సమాచారం
రూల్స్ బ్రేక్ చేస్తే భారీగా ట్యాక్స్ క‌ట్టాల్సిందే
ఎన్నిక‌ల వేళ సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు త‌ప్ప‌ని తిప్ప‌లు
అనుమానాస్పద లావాదేవీలపైనా నిఘా
నగదు జమ, విత్​డ్రాయల్స్​ విషయంలోనూ జాగ్రత్త
పరిమితికి మించి పైసలు జమ చేస్తే అంతే సంగతి

దేశ‌వ్యాప్తంగా ఎన్నిక‌ల కోడ్ అమ‌లులో ఉన్నందున న‌గ‌దు లావాదేవీల‌పై ఈసీ నిఘా పెట్టింది. రూల్స్ మ‌రింత క‌ఠిన‌త‌రం చేసింది. పౌరుల బ్యాంకు అకౌంట్ల‌లో ట్రాన్షాక్ష‌న్ పై దృష్టిసారించింది. ఇప్పటికే ఎన్నికల వేళ సాధారణ ప్రజలకు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న త‌రుణంలో.. కొత్త ఆర్ధిక ఏడాదితో పాటు, ఎన్నికల నిబంధనలు ప్రజలకు మ‌రింత చుక్క‌లు చూపనున్నాయి. ఏప్రిల్‌ 1నుంచి ఎన్నికలతో ఎటువంటి సంబంధం లేని సాధారణ ప్రజలకు కూడా ఎన్నికల సంఘం విధించిన మార్గదర్శకాల రాక గుబులు పుట్టిస్తోంది. కొత్త ఆర్ధిక ఏడాది నేపథ్యంలో నగదు, బ్యాంకు డిపాజిట్లపై ఈసీ కీలక సూచనలు చేసింది. సరికొత్త నిబంధనలను తెరపైకి తెస్తూ ఆర్బీఐ అమలులోకి తీసుకొస్తోంది. సాధార‌ణ పౌరుల ఖాతాపై నిఘా పెట్టి.. రెండు నెల‌ల్లో రూ.ల‌క్ష‌కు మించి డిపాజిట్ చేసిన అకౌట్ల డిటెయిల్స్ ఐటీ శాఖ‌తోపాటు ప్ల‌యింగ్ స్క్వాడ్ కు పంపాల‌ని ఆదేశించింది.

అనుమానాస్ప‌ద లావాదేవీల‌పై నిఘా

పార్ల‌మెంట్ ఎన్నిక‌ల వేళ ఈసీ అనుమానాస్ప‌ద లావాదేవీల‌పై నిఘా పెట్టింది. ఇప్పటికే ఎన్నికల కోడ్‌ కారణంగా రాష్ట్రంలో పెండ్లిళ్లు, ఆస్పత్రి ఖర్చులకు కూడా సాధారణ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అనేక రకాలుగా ఈసీ నిబంధనల చట్రం అమలు చేస్తున్న తీరు గుర్తించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల సంరంభానికి తెర లేచిన నేపథ్యంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వివిధ పార్టీలు, అభ్యర్థులు డబ్బు విరివిగా పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలంగాణలో డబ్బు ప్రభావం ఎక్కువని ఈసీ అనుమానిస్తోంది. ఈ క్రమంలో ఎన్నికల ప్రక్రియ సాగుతున్న వేళ.. బ్యాంకుల్లో అనుమానాస్పదంగా సాగే ఆర్థిక లావాదేవీలపై నిఘా పెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -

లక్షకు మించి డిపాజిట్​.. తనిఖీ చేయాలని ఆదేశాలు

ఈ విషయంలో అన్ని రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారుల (సీఈఓ)కు సీఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు నెలల్లో ₹లక్ష పైచిలుకు డిపాజిట్‌, విత్‌ డ్రాయల్‌ చేసిన అకౌంట్స్‌, ఒకే జిల్లాలో పలువురికి ఆన్‌లైన్‌లో నగదు బదిలీ చేసిన ఖాతాల వివరాలను సేకరించాలని పేర్కొంది. బ్యాంకుల్లో ₹ లక్షకు మించి డిపాజిట్‌ చేసిన అభ్యర్థి, ఆ అభ్యర్థి కుటుంబ సభ్యులు, పార్టీల ఖాతాల వివరాలను సేకరించాలని సీఈఓలను ఈసీ ఆదేశించింది. ₹ 10 లక్షలు డిపాజిట్‌ చేసిన ఖాతాల వివరాలను ఆదాయం పన్ను విభాగం అధికారులకు అందజేయాలని సూచించింది. జిల్లా ఎన్నికల అధికారులు అన్ని బ్యాంకుల నుంచి సమాచారం తెప్పించుకోవాలని, ఆ డేటాలో అనుమానాస్పదమైన లావాదేవీలు ఉంటే వాటి వివరాలను ప్ల‌యింగ్‌ స్క్వాడ్‌లకు ఇవ్వాలని పేర్కొంది.

న‌గ‌దు జ‌మ‌, విత్ డ్రాపై ఐటీ నిఘా

దేశంలో, రాష్ట్రంలో పలు బ్యాంకులు జీరో బ్యాలెన్స్‌ అకౌంట్లను అందిస్తుండగా, మరి కొన్ని బ్యాంకులు మినిమం బ్యాలెన్స్‌తో సేవింగ్స్‌ అకౌంట్‌ సేవలు అందిస్తున్నాయి. బ్యాంకు ఖాతాలలో అకస్మాత్తుగా అత్యధిక మొత్తంలో న‌గదు జమ, నగదు విత్‌డ్రాలపై ఐటీ శాఖ నిఘా పెంచింది. పరిమితికి మించితే భారీగా పెనాల్జి లను వసలూ చేసి విచారణ జరిపేందుకు నిర్ణయించింది. ఈ నిబంధన ప్రకారం సాధారణ సేవింగ్స్‌ అకౌంట్‌లో ఆర్థిక సంవత్సరానికి (ఏప్రిల్‌ – మార్చి ) క్యాష్‌ డిపాజిట్‌ పరిమితి రూ.10 లక్షలుగా నిర్ణయించారు. రూ.10 లక్షలకు మించి లావాదేవీలు జరిపితే బ్యాంకులు వెంటనే ఆదాయపు పన్ను శాఖకు సమచారాన్ని అందించనున్నాయి. ఆ వెంటనే దసరు అనుమానిత లావాదేవీలపై ఐటీ శాఖ ఖాతాదారుకు నోటీసులు జారీ చేయనుంది. రూ. 10 లక్షలకు మించిన డిపాజిట్లకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ఆధారాలు ఖాతాదారు చూపాల్సి రానుంది. కరెంటు ఖాతాలకు ఆర్థిక సంవత్సరానికి రూ.50 లక్షల వరకు పరిమితి ఉంటుందని, ఆదాయపు పన్ను చట్టం 1962, సెక్షన్‌ 114బీ ప్రకారం ప్రతి బ్యాంకు రూ. 10 లక్షలకు మించి లావాదేవీలు జరిగిన ఖాతాల వివరాలను ఐటీ శాఖకు అందిచాల్సి ఉంటుందని వెల్లడించింది. ఖాతాదారునికి ఎన్ని బ్యాంకు అకౌంట్ల ఉంటే అన్నింట్లో కలిపి ఆర్థిక సంవత్సరానికి రూ.10 లక్షల వరకే డిపాజిట్‌ పరిమితి ఉంటు-ంది.

₹10 ల‌క్ష‌లు మించితే భారీగా ప‌న్ను..

సేవింగ్స్‌ అకౌంట్లలో రోజుకు రూ.లక్ష వరకు డిపాజిట్‌ చేయవచ్చని, ఒకవేళ చాలా రోజులు లావాదేవీలు జరపకపోతే రూ.2.5 లక్షల వరకు డిపాజిట్‌ చేసుకోవచ్చని చెబుతున్నారు. మొత్తంగా ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలకు మించకూడదు. 10 లక్షలు మించి మీరు క్యాష్‌ డిపాజిట్‌ చేస్తే ఆదాయపు పన్ను శాఖకు ఆధారాలు సమర్పించాలని, లేనిపక్షంలో 60 శాతం ట్యాక్స్‌తో పాటు, 25 శాతం సర్‌ ఛార్జ్‌, 4 శాతం సెస్‌ను పెనాల్టీగా చెల్లించాల్సి ఉంటుందని ఐటీ శాఖ హెచ్చరిస్తోంది. నిబంధనలు అతిక్రమించి రూ. 10 లక్షలకు మించి నగదు డిపాజిట్‌ చేసే డబ్బులో 89 శాతం పన్ను రూపంలో కోల్పోవాల్సి వస్తుందని తాజాగా వెల్లడగించారు. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్‌ 194 ఎన్‌ ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. కోటికి మించి నగదు విత్‌ డ్రా చేస్తే 2 శాతం టీ-డీఎస్‌ వర్తిస్తుందని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఒకవేళ ఆదాయపు పన్ను రిటర్నులు ఫైల్‌ చేయని వారైతే రూ. 20 లక్షలకు మించి విత్‌ డ్రా చేస్తే 2 శాతం టీ-డీఎస్‌ వర్తిస్తుందని వెల్లడించారు. అదే రూ. కోటి దాటితే వీరికి 5 శాతం టీ-డీఎస్‌ వర్తిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement