Thursday, July 11, 2024

ఎడ్‌ సెట్‌, లాసెట్‌ ప్రశాంతంగా పూర్తి..

అమరావతి, ఆంధ్రప్రభ: బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఏపీఎడ్‌సెట్‌- 2022 బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా జరిగినట్లు ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొ. బి. సుధీర్‌ ప్రేమ్‌ కుమార్‌ తెలిపారు. ఈ పరీక్షకు 13 వేల 978 మంది దరఖాస్తు చేసుకోగా.. 11 వేల 384 మంది హాజరయ్యారని, 2 వేల 594 మంది ఆబ్సెంట్‌ అయ్యారని, హాజరు శాతం 81.44 శాతంగా నమోదైందని వెల్లడించారు.

అలాగే మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ, ఐదేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీ లా, పీజీఎల్‌సెట్‌- 2022కు రాష్ట్రవ్యాప్తంగా 15 వేల 709 మంది రిజిస్టర్‌ చేసుకోగా.. 13 వేల 180 మంది హాజరై పరీక్ష రాశారు. 2 వేల 529 మంది ఆబ్సెంట్‌ కాగా.. హాజరు శాతం 83.9 శాతం నమోదైనట్లు కార్యదర్శి ప్రొ. సుధీర్‌ ప్రేమ్‌ కుమార్‌ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement