Saturday, April 27, 2024

పీజీ సెట్ లో…శ్రీ ప్రకాష్ విద్యార్థులకు ఉత్తమ ర్యాంకులు..

తుని ; శ్రీ ప్రకాష్ అనుబంధ సంస్థ అయిన స్పేసెస్ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఏపీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ఫలితాలలో విశేష ప్రతిభ కనబరిచి ఉత్తమ ర్యాంకులు సాధించారు. కెమిస్ట్రీ విభాగంలో ఎల్. జగదీష్ 25వ ర్యాంకు, ఎ. ఉమామహేశ్వరి 33వ ర్యాంకు, డి. సుకన్య 55 వ ర్యాంకు, ఎల్వివి మణికుమార్ 56 వ ర్యాంకు, ఎస్. కావ్య 71 వ ర్యాంకు, డి. భువనేశ్వరి 97వ ర్యాంకు సాధించారు. బయో కెమిస్ట్రీ విభాగంలో సి.హెచ్. తేజ రేష్మా 21వ ర్యాంకు, అదేవిధంగా బయో టెక్నాలజీ విభాగంలో టి. శ్రీ పూజిత 64 వ ర్యాంకు, బోటనీ విభాగంలో పి.లలిత 87 వ ర్యాంకు, ఫిజిక్స్ విభాగంలో ఎస్సీ కేటగిరి లో జి. సోనాలిసా 28 వ ర్యాంకు సాధించారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.వీర్రాజు తెలిపారు. ఏపీ పీజీ సెట్ లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను శ్రీ ప్రకాష్ విద్యాసంస్థల సంయుక్త కార్యదర్శి సి.హెచ్ విజయ్ ప్రకాష్ , వైస్ ప్రిన్సిపాల్ పి. సుబ్బారావు , కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ హెడ్ శివ గంగాధర్, బయో కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ హెడ్ త్రిపాటి, బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ హెడ్ రెడ్డి, ఫిజిక్స్ డిపార్ట్మెంట్ హెడ్ సంతోష్ కుమార్ మరియు అధ్యాపక బృందం అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement