Saturday, May 4, 2024

AP | రేపటి నుంచి ఏపీలో దసరా సెలవులు.. ఉత్తర్వులు జారీ..

ఏపీ, తెలంగాణ‌ రాష్ట్రాల్లో దసరా పండుగ సందడి ప్రారంభమైంది. ఈ క్రమంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు స్కూళ్లు, కాలేజీలకు దసరా సెలవులు ప్రకటించాయి. ఈ రోజు నుంచి తెలంగాణలో అన్ని విద్యాసంస్థలకు దసరా సెలవులు అమలులోకి వచ్చాయి. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో రేపట్నుంచి అంటే శనివారం (అక్టోబర్‌ 14) విద్యాసంస్థలకు దసరా సెలవులు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు రాష్ట్రంలోని పాఠశాలలకు అక్టోబరు 14 నుంచి 24 వరకూ దసరా సెలవులను ఖరారు చేస్తూ అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement