Thursday, May 2, 2024

Drought ఎండిన పంట పొలాలు – రైతుల కళ్ళలో ఇంకిన కన్నీళ్లు

తుగ్గలి నవంబర్ 5 (ప్రభ న్యూస్) రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం రైతాంగాన్ని గాలికి వదిలేసినట్లు మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పత్తిపాటి పుల్లారావు, కాల్వ శ్రీనివాసులు, బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి లు అన్నారు. ఆదివారం సాయంత్రం మండలంలో పలు గ్రామాలలో రైతులు సాగుచేసిన పంట పొలాలను టిడిపి రాష్ట్ర కరువు బృందం పరిశీలించారు. ఈ సందర్భంగా టిడిపి ఇన్చార్జ్ కె ఈ శ్యాంబాబు ఆధ్వర్యంలో మండలంలో ని పలువురు రైతులు మండలంలో నెలకొన్న కరువు పరిస్థితులను టిడిపి కరువు బృందానికి వివరించారు..

వర్షాలు సక్రమంగా కురవకపోవడం వల్ల ఈ సంవత్సరం పంటలన్నీ ఎండిపోవడంతో ,పొలాల్లోనే సాగు చేసిన పంటలను వదిలేయడం జరిగిందని, గ్రామాల్లో త్రాగునీటి సమస్య కూడా ఉత్తన్నమవుతుందని, పశువులకు పశుగ్రాసం కూడా దొరకడం లేదని, ఇంత దుర్భరమైన పరిస్థితులు మండలంలో ఉన్నప్పటికీ ప్రభుత్వం కనీసం కరువు మండలంగా కూడా ప్రకటించలేదని రైతులు టిడిపి కరువు బృందం వద్ద తమ ఆవేదనను వెలగెక్కారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పత్తిపాటి పుల్లారావు ,కాల్వ శ్రీనివాసులు, బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి లు రైతులతో మాట్లాడుతూ రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం వచ్చిన నాటి నుండి రైతాంగానికి కష్టాలు మొదలయ్యాయని అన్నారు. మండలంలో తీవ్రమైన కరువు పరిస్థితులు ఉన్నాయని, అయితే ప్రభుత్వం ఎందుకు కరువు మండలంగా ప్రకటించలేదని ఇది ప్రభుత్వానికి కనిపించడం లేదా అంటూ ప్రభుత్వంపై ఆయన ఆగ్రహం చెందారు. రైతాంగానికి టిడిపి పార్టీ అండగా ఉంటాదన్నారు. కరువు మండలంగా ప్రకటించేదాకా టిడిపి రైతులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేసేందుకు సిద్ధంగా ఉంటాదన్నారు. అలాగే రైతులు సాగు చేసి నష్టపోయిన ఈ ప్రాంతంలో ప్రధానమైన పంటలు వేరుశనగ , కంది, ఆముదము, సద్ద, పత్తి, ఉల్లి తదితర పంటలన్నింటికీ ఎకరాకు రూ 30 వేలు పైగా నష్ట పరిహారం చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. త్వరలో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని తద్వారా రైతాంగ సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన రైతులకు భరోసా ఇచ్చారు

. ఈ కార్యక్రమంలో టిడిపి ఇన్చార్జ్ కెఈ శ్యాంబాబు, మాజీ జెడ్పీ చైర్మన్ బత్తిన వెంకటరాముడు, మండల టిడిపి కన్వీనర్ తిరుపాల్ నాయుడు, మహిళా అధ్యక్షురాలు రాతన ఈరమ్మ, టిడిపి నాయకులు మనోహర్ చౌదరి, కృష్ణమూర్తి చౌదరి, కొట్టాల వెంకట్రామ్ చౌదరి, ఎద్దులదొడ్డి శ్రీనివాసులు గౌడ్, వెంకటపతి, కొమ్ము వెంకటేశ్వర్లు ,మా భాష, జొన్నగిరి లక్ష్మణ స్వామి, మిద్దె రవి యాదవ్, సంఘాల కృష్ణ, గిరిగేట్ల సత్య ప్రకాష్,గిరిగేట్ల మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement