Monday, April 15, 2024

గుత్తి – పెండేకల్లు మధ్య రైలు మార్గం డబ్లింగ్‌.. రైల్వే మంత్రిత్వ శాఖ అనుమతి

అమరావతి,ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌లోని గుత్తి -పెండేకల్లు రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే లైను ను డబుల్‌ లైన్‌ గా మార్చేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది . 29.2 కిలోమీటర్ల మేర సాగే ఈ విభాగం యొక్క డబ్లింగ్‌ పనులు చేపట్టేందుకు రూ. 351.8 కోట్ల అంచనా వ్యయంతో ప్రత్యేక అనుమతి లభించింది. గుత్తి – పెండేకల్లు సెక్షన్‌ , దక్షిణ మధ్య రైల్వేలోని గుంతకల్‌ డివిజన్‌లో ముఖ్యంగా సికింద్రాబాద్‌ /హైదరాబాద్‌ మరియు బెంగళూరు రైల్వే స్టేషన్‌ల మధ్య సాగే కీలకమైన రైళ్ల నిర్వహణ -కై- వున్నా విభాగాలలో ఇది చాల కీల-కై-మైనది. చాలా రైళ్లు ఈ విభాగం గుండా వెళ్తూ ఈ రెండు నగరాలను అవతలి ప్రాంతాలను కనెక్ట్‌ చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఈ విభాగంలో కొన్ని సంవత్సరాలుగా ప్యాసింజర్‌ మరియు సరుకు రవాణా రైళ్లలో స్థిరమైన పెరుగుదలతో రద్దీ ఏర్పడింది. ఈ విభాగాన్ని డబ్లింగ్‌ చేయడం వల్ల రైళ్ల రాకపోకలు మరింత సులభతరం అవుతాయి. అలాగే నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి.

తద్వారా ఈ విభాగంలో మరిన్ని రైళ్లను ప్రవేశపెట్టడానికి అవకాశం కూడా లభించే అవకాశం వుంది . గుంతకల్‌-గుంటూరు డబ్లింగ్‌ ప్రాజెక్టులో భాగంగా పెండేకల్లు-గుంటూరు సెక్షన్ల మధ్య రైల్వే లైను డబ్లింగ్‌ను భారతీయ రైల్వే ఇప్పటికే మంజూరు చేసింది.. పనులు కుడా పురోగతిలో ఉన్నాయి. అదేవిధంగా ఈ ప్రాంతంలోని మరో కీలకమైన సెక్షన్‌ గుత్తి -ధర్మవరం కూడా ఇటీ-వల డబుల్‌లైన్‌ సెక్షన్‌గా మార్చారు. అందువల్ల గుత్తి -పెండేకల్లు రైల్వే స్టేషన్ల మధ్య 29.2 కి.మీ రైల్వే లైను డబ్లింగ్‌ చేయడం వల్ల హైదరాబాద్‌ -సికింద్రాబాద్‌ మరియు బెంగళూరు మధ్య డబుల్‌ లైన్ల వెంట మరియు రెండు వైపులా రైళ్లు రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా రాకపోకలు సాగించేందుకు అనుకూలంగా ఉంటుంది.

- Advertisement -

ఈ ప్రాంతంలో ఏకకాలంలో చేపట్టే ఇతర డబ్లింగ్‌ ప్రాజెక్టులతో పాటు- ఈ కీలకమైన విభాగం డబ్లింగ్‌ చేయడం వల్ల ఈ ప్రాంతాల సామాజిక-ఆర్థిక వృద్ధికి ఎంతో తోడ్పడుతుంది. సరకు రవాణా రైళ్ల వేగవంతమైన కదలిక ద్వారా ఈ ప్రాంతంలోని పరిశ్రమలకు కూడా ప్రయోజనం చేకూరుతుంది .ఈ విభాగాల్లో రైళ్ల సగటు- వేగం పెరగడంతో ప్రయాణికులకు కుడా లబ్ది చేకూరుతుంది .

Advertisement

తాజా వార్తలు

Advertisement