Monday, April 29, 2024

Divide Politics – అప్పుడు బాబాయ్… ఇప్పుడు చెల్లీ – కాంగ్రెస్ పై విరుచుకుపడ్డ జగన్

తిరుపతి .- గతంలో మా బాబాయ్‌ను నాపై పోటీకి నిలబెట్టారు.ఇప్పుడు మా సోదరి షర్మిలనీ ప్రయోగిస్తున్నారని మండిపడ్డారు.ఈరోజు ఇండియాటుడే ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌లో సీఎం జగన్‌ పాల్గొన్నారు..ఈ కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ…ఏపీలో కాంగ్రెస్‌ చెత్త రాజకీయం చేస్తుంది.. దేవుడు వాళ్లకు గుణపాఠం చెబుతాడు..

గతంలోనూ మా బాబాయ్‌ని మంత్రిని చేసి మాకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నిలబెట్టింది.. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోని కాంగ్రెస్‌.. ఈ సారి మా సోదరిని ప్రయోగించింది. తమ కుటుంబాన్ని విడగొట్టి కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు… కుటుంబాల్లో విభేదాలు సృష్టించి పాలిటిక్స్ చేస్తోన్న వాళ్లకు దేవుడే బుద్ధి చెబుతారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..

జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకి ఆంధ్ర ప్రదేశ్ లో స్థానం లేదని తెలిపారు. టీడీపీ, జనసేన పార్టీలతోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పోటీ అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసమే కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. ఇష్యూ బేస్డ్ విషయంలో కేంద్రంలో బీజేపీకి మద్దతు ఇస్తామని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. సర్వేలలో ప్రజా వ్యతిరేకత వచ్చిన నాయకులకు టికెట్లు ఇవ్వలేదని స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఆ పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుంది ఆశ భావం వ్యక్తం చేశారు.

ఇక, పేదరికాన్ని నిర్మూలించాలంటే అది నాణ్యమైన చదువు ద్వారానే సాధ్యమని నేను నమ్ముతాను అన్నారు సీఎం జగన్‌.. విద్య మాత్రమే కాదు, నాణ్యమైన విద్య అనే ప్రతి ఒక్కరి హక్కుకావాలన్న ఆయన.. పేదలు ఒక చదువుకు పరిమితమైతే, సంపన్నుల పిల్లలు వేరే చదువులు చదువుతున్నారు.. పేద పిల్లలు కేవలం తెలుగుమీడియంకు పరిమితమైతే, సంపన్నుల పిల్లలు ఇంగ్లిషు మీడియం చదువుతున్నారు.. సంపన్నులకు అందే నాణ్యమైన చదువులు పేద పిల్లలకూ అందాలి.. మా రాష్ట్రంలో పేదపిల్లలకు సంపన్నుల పిల్లలకు అందే చదువులు అందాలన్నదే మా లక్ష్యంగా పేర్కొన్నారు. కేవలం మేం స్కూలు విద్యపైనే కాదు, ఉన్నత విద్యపైనా ప్రత్యేక దృష్టిపెట్టాం.. ఉద్యోగాలు సాధించే కోర్సులను అందిస్తున్నాం.. ఇంటర్నషిప్‌ అందిస్తున్నాం.. ఆన్‌లైన్‌ వర్టికల్స్‌ అందిస్తున్నాం.. పాఠ్యప్రణాళికలో వీటిని భాగస్వామ్యం చేశాం అని వెల్లడించారు.

పిల్లలు ఆన్‌లన్‌లో మరిన్ని కోర్సులు నేర్చుకునేందుకు 1800 సబ్జెక్టుల్లో కోర్సులను అందించడానికి ఎడెక్స్‌తో ఒప్పందం చేసుకున్నాం.. బీకాం నేర్చుకునేవారికి అసెట్‌ మేనేజ్‌ మెంట్‌ తదితర అంశాలను నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాం.. ఇవన్నీకూడా పాఠ్యప్రణాళికలో భాగం చేస్తున్నాం అని తెలిపారు. రాజకీయాలు వేరే.. పిల్లలు ఓటర్లు కాదు కాబట్టి.. వారిపైన పెద్దగా శ్రద్ధ పెట్టరు.. అయితే విద్య అలాంటి అంశాలపై దృష్టిపెట్టకపోతే పేదరికాన్ని నిర్మూలించలేం అని అభిప్రాయపడ్డారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.

Advertisement

తాజా వార్తలు

Advertisement