Tuesday, May 7, 2024

Dhrana – ఉపాధి హామీ బిక్షం కాదు హక్కు…బి.వి రాఘవులు…

క‌ర్నూలు – ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలసత్వం వహిస్తున్నాయని పేదలకు వరంగా ఉన్న పథకానికి తూట్లు పొడుస్తూ కనీసం 70 వేల కోట్ల బడ్జెట్ కూడా కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి రాఘవులు. ఆదాని ఆస్తులు పెరిగినంత వేగంగా పేదల కడుపు నింపే పథకం బడ్జెట్ మాత్రం పెరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా కేంద్రంలో ధర్నా చౌక్ లో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వీర శేఖర్ అధ్యక్షత న ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ ధర్నాకు వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత జాతీయ నాయకుడు, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి రాఘవులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే ఆనాడు పేదల ఆకలికేకలు వారి వలసలు నివారణ 40 కోట్ల వ్యవసాయ కూలీల ఉపాధి ని దృష్టిలో పెట్టుకుని వామపక్ష పార్టీల ఉద్యమంలో భాగంగా సాధించిన ఉపాధి హామీ చట్టాన్ని ప్రస్తుత కేంద్రం నిర్వీర్యం చేస్తుందన్నారు.ఇప్పటికే దాదాపు 40 శాతం జాబ్ కార్డులను తొలగించారన్నారు.వారం రోజులు పని చేస్తే నాలుగు రోజులు లెక్క కట్టి కూలిని ఇస్తున్నారు.100 రోజులు చేస్తే 80 రోజులే పనులు చేస్తున్నారు.ఉపాధి హామీ ఎవ్వరికీ ఇష్టం లేదు కాబట్టి ఈ పథకాన్ని తీసేయాలి అనే అబద్ధపు ప్రచారాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయన్నారు.వ్యవసాయ కూలీలు,చిన్న సన్నకారు రైతులు పేదలుకలిసి కట్టుగా ఉపాధిని రక్షించుకోవడం మనందరి బాధ్యతగా సాధించుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ పథకాన్ని తూట్లు పొడిచి కూలీలే ఈ పథకం ఈ పని వద్దు అనే పరిస్థితుల్లోకి తీసుకొస్తున్నారని కానీ ఈ పథకం ద్వారా కొన్ని వేల కుటుంబాలు వలసలు నివారణకు ఉపయోగంగా ఉందన్నారు.ఉపాధి హామీ బిక్షం కాదు మనం సాధించుకున్న హక్కు దీనిని నిర్వర్యం చేస్తే సహించేది లేదని కలిసికట్టుగా మన హక్కు సాదించుకోవడం కోసం మరిన్ని పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.వి నారాయణ మాట్లాడుతూ జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లో గ్రామాల్లో ఉపాధి హామీ పనులను పరిశీలించాము. అక్కడ పేదలకు ఉపాధి హామీ పథకం కడుపు నింపుతుందంటున్నారు.వలసలు వెళ్లకుండా వేసవిలో ఉపాధి పథకం ఉండటం వల్ల పేదలు బతుకుతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఈ పథకాన్ని నిర్వీర్యం చేసేలా కుట్రలు పన్నుతున్నారన్నారు.

జిల్లాలో 17 లక్షల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని వేసవి అలవెన్స్ అమలు చేయాలన్నారు. పని ప్రదేశాల్లో నీళ్లు నీడ ప్రథమ చికిత్స చేసేలా మెడికల్ సదుపాయాలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.పని చేసిన 15 రోజుల్లో ప్లే స్లిప్పులు ఇవ్వాలని 200 రోజులు తగ్గకుండా పనిదినాలు కల్పించాలన్నారు. ఉపాధి హామీ పథకం ఉండటం వల్ల జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో కాస్త వలసలు తగ్గాయని మరింతగా అమలు చేసి సకాలంలో బిల్లులు అందిస్తే వలసలు కొద్దిగా అయిన అగుతాయన్నారు.చాలా గ్రామాల్లో వైసిపి వారు మాస్టర్లలో హాజరు వేసుకుని బిల్లులు దండుకుంటున్నారని అటువంటి వారిపై చర్యలు తీసుకుని వ్యవసాయ కూలీలకు పనులు కేటాయించాలన్నారు.

రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ఉపాధి హామీని నిర్వీర్యం చేస్తే సహించేది లేదని ఇప్పటికే 36 వేల కోట్లు కొత్త పెట్టారని రెక్కాడితే డొక్కాడని పేదల పథకాన్ని హరించడం సరైంది కాదన్నారు.పని ప్రదేశాల్లో అధికారులు పర్యటించి నీళ్లు,మజ్జిగ నీడ వసతులు వెంటనే ఏర్పాటు చేయాలన్నారు.వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ చట్టాన్ని సాధించడం కోసం రైతులు రైతు సంఘాలు ఎప్పుడు మద్దతుగా ఉంటాయన్నారు.
సిఐటియు జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో కూడా కేంద్రం కులం మతం చిచ్చు పెట్టి తగాదాలు పెట్టేలా వ్యవహరిస్తోందని బడ్జెట్ కేటాయింపుల్లో పూర్తిగా నిర్వీర్యం చేసేలా ఉందన్నారు
. ధర్నా అనంతరం ధర్నా చౌక్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి కలెక్టర్ కు డిమాండ్లతో కూడిన వినతిని అందించారు. కలెక్టర్ స్పందించి మాట్లాడుతూ పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలి. పని ప్రదేశం లో గాయపడిన మహిళకు మంచి వైద్యం అందించాలని డిఎం అండ్ హెచ్ ఓ ను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు తిక్కన్న,లింగన్న,బాలకృష్ణ, నాగన్న, సిఐటియు జిల్లా కార్యదర్శి అంజిబాబు,సిపిఎం నగర కార్యదర్శులు రాజశేఖర్, రాముడు,రజక వృత్తి దారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గురు శేఖర్,నాయకులు సుభాన్ ,షరీఫ్ , విజయ్ ,రాఘవేంద్ర,ఉపాధి హామీ కూలీలు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement