Saturday, April 13, 2024

AP: నైపుణ్యాల‌ను పెంపొందించుకోండి… మంత్రి ధ‌ర్మాన

శ్రీకాకుళం, ఫిబ్రవరి 21(ప్ర‌భ‌న్యూస్‌): ప్రభుత్వ డిగ్రీ క‌ళాశాల(పురుషులు)లో స్కిల్ క్వెస్ట్ (ఎంటర్,ఎక్స్ ప్లోర్,ఎర్న్) స్టాల్స్ ను రెవెన్యూ శాఖా మంత్రి ధర్మాన ప్రసాదరావు బుధవారం ప్రారంభించారు. అనంత‌రం విద్యార్థులను అభినందించారు. మెరుగైన ఫలితాల కోసం ఉపాధ్యాయ బృందం కృషి చేస్తున్నార‌ని కొనియాడారు.

- Advertisement -

సరైన ఆలోచన,శిక్షణ ఉన్ననాడే ఉత్తమ ఫలితాలు కలుగుతాయని అన్నారు. పెరుగుతున్న జనాభాతో పాటు ఉద్యోగాల కొరత ఏర్పడిందని,అలాంటి త‌రుణాన ప్ర‌యివేటు ఉద్యోగాలను చేసేందుకు నిరుద్యోగ యువ‌త సిద్ధంగా ఉండాల‌ని సూచించారు. అందుకు ఇటువంటి ప్ర‌ద‌ర్శ‌న‌లు కానీ, స్టాల్స్ నిర్వ‌హ‌ణ కానీ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయని అన్నారు. ఉద్యోగం అంటే కేవలం ప్రభుత్వం కల్పన కంటే ప్రైవేటు ఉద్యోగానికి అయిన సంసిద్ధం కావాలి అని, అవగాహన,చొరవ అన్న‌వి చ‌దువుకున్న రోజుల నుంచే పెంపొందించుకోవాలన్నారు. జీవితాన్ని తీర్చి దిద్దుకునేం దుకు ప్రాక్టిక‌ల్ నాలెడ్జ్ ఎంతో అవసరం అని అభిప్రాయ‌ప‌డ్డారు. కార్య‌క్ర‌మంలో ప్రిన్సిపల్ సురేఖ, రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ ఛైర్మన్ మామిడి శ్రీకాంత్, మాజీ మున్సిపల్ ఛైర్ ప‌ర్స‌న్ మెంటాడ పద్మావతి,న‌గ‌ర వైఎస్సార్సీపీ అధ్యక్షులు సాధు వైకుంఠ రావు, సురంగి మోహన్ రావు, లుకలాపు గోవింద్ రావు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement