Sunday, April 28, 2024

Depression in Bay of Bengal – ఉత్త‌రాంధ్రకు వాయి’గండం’ … భారీగా వ‌ర్షాలు కురిసే అవ‌కాశం …..

హైద‌రాబాద్/అమ‌రావ‌తి -దేశంలో నైరుతి రుతుపవనాల సీజన్ ముగిసింది. ఆలస్యంగా ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు ఆలస్యంగానే నిష్క్రమించాయి. ఇక, దేశంలో ఈశాన్య రుతుపవనాల సీజన్ ప్రారంభం కానుంది. నైరుతి తగినంత వర్షపాతం ఇవ్వని నేపథ్యంలో, పలు రాష్ట్రాలు ఈశాన్య రుతుపవనాలపైనే ఆశలు పెట్టుకున్నాయి. ఈశాన్య రుతుపవనాలు వస్తూనే అల్పపీడనం ఏర్పడేందుకు అనువైన పరిస్థితులను కల్పిస్తున్నాయి. నేడు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రేపటికి ఇది అల్పపీడనంగా మారనుందని ఐఎండీ అమరావతి విభాగం వెల్లడించింది. ఇది వాయవ్య దిశగా పయనించి అక్టోబరు 23 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించి వాయుగుండంగా బలపడనుందని వివరించింది. దీని ప్రభావం ఉత్తరాంధ్రపై ఉంటుందని భావిస్తున్నారు. ఈ వాయుగుండంతో మళ్ళీ జోరు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది ఇది వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది. దాని ప్రభావంతో ఈనెల 21 ఉదయం నాటికి బంగాళాఖాతంలోని మధ్య భాగాల మీద అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని, ఆ తర్వాత, అది మరింత బలపడి 23వ తేదీ నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం గా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.

దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న మూడు రోజుల్లో రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. నైరుతి రుతుపవనాలు గురువా రం దేశం మొత్తం నుండి ఉపసంహరించుకు న్నాయి. అల్పపీడన ప్రభావం వల్ల ఈశాన్య రుతుపవనాల ఆగమాని కి మార్గం సుగమమైందని అవి వచ్చినట్లయితే రాష్ట్రంలో వర్షాలు ఊపందుకొని అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడి అల్పపీడనంగా ఆ తరువాత వాయుగుండంగా బలపడితే ఈ నెల 25 నాటికి ఉత్తరకోస్తా, దక్షిణ ఒడిసా తీరాలకు తుఫాన్‌ గండం ఉండొచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడి అల్పపీడనంగా ఆ తరువాత వాయుగుండంగా బలపడితే ఈ నెల 25 నాటికి ఉత్తరకోస్తా, దక్షిణ ఒడిసా తీరాలకు తుఫాన్‌ గండం ఉండొచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement