Wednesday, May 1, 2024

సిరులు కురిపిస్తున్న ప‌సుపు పంట‌లు..

ఉత్తరాంధ్రలోని ఏజన్సీ ప్రాంతాల్లో గిరిజన రైతులకు పసుపు పంట సిరులు కురిపిస్తోంది. ఏటా సుమారు రూ.200 కోట్లకు పైగా ఎగుమతులు చేయడం విశేషం. ఏజన్సీలోని కొన్ని ప్రాంతాల్లో వందల ఏళ్ల పసుపు వ్యాపారం సాగుతోంది. పసుపు ప్రాసెసింగ్‌ కేంద్రాలు కూడా ఉన్నాయి. ప్రధానంగా విశాఖ మన్యంలో 11 మండలాల్లో పండించే పసుపంతా మాడుగుల చేరుతుంది. అక్కడ ప్రాసెసింగ్‌ జరిపి వివిధ రూపాల్లో విక్రయాలు చేస్తున్నారు. ఔషధ గుణాలున్న ఈ ఆర్గానిక్‌ పసుపు మంచి డిమాండ్‌ ఉండడమే కాకుండా పరిశ్రమలో పనిచేసే కార్మికులకు కరోనాను కూడా దరి చేరనివ్వక పోవడం విశేషం.

మన్యంలో సాగు చేసే పసుపు పంట సాగు, ప్రాసెసింగ్‌ చేసే ఉత్పత్తుల యూనిట్ల వలన వందలాది కుటుంబాలకు జీవనోపాధిలభిస్తోంది. సీజన్‌లో సుమా రు 300 లారీలు పసుపు ను 200 మంది చిన్నా పెద్ద వ్యాపారులు మాడుగులలో కొనుగోలు చేస్తారు. ఇక్కడ పసుపును ఉడికించి డ్రమ్ముల్లో వేసి మంచి ఛాయ పసుపుగా తయారు చేసి ఆకర్షణీయమైన ప్యాకెట్‌లలో వేసి ఇతర రాష్ట్రాల్రకు ఎగుమతి చేస్తారు. ఈ విధంగా రైతుల దగ్గర నుంచి మార్కెట్‌కు వెళ్లే వరకు సుమారు 1500 కుటుంబాలు దీనిపై ఆధార పడి మనుగడ సాగిస్తున్నారు. ప్రతి ఏటా సుమారు రూ.200 కోట్ల మేరకు వ్యాపారం జరుగుతుందని స్థానికులు చెబుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement