Saturday, April 20, 2024

అడ‌విశేషుకి టీష‌ర్ట్ గిఫ్ట్ ఇచ్చిన మేజ‌ర్ సందీప్ తల్లి

ముంబైలో జ‌రిగిన ఉగ్ర‌దాడుల్లో వీర మ‌ర‌నం పొందిన మేజ‌ర్ సందీప్ ఉన్ని కృష్ణ‌న్ జీవిత క‌థ ఆధారంగా మేజ‌ర్ చిత్రం తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంలో మేజ‌ర్ పాత్ర‌లో యంగ్ హీరో అడ‌విశేషు మెర‌వ‌నున్నాడు. కాగా ఈ చిత్రాన్ని టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు నిర్మిస్తుండ‌టం విశేషం. శోభిత దూళిపాళ్ల కీలక పాత్రను చేస్తోంది. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. వ‌చ్చే ఏడాది ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రం ద్వారా సందీప్ ఫ్యామిలీకి ద‌గ్గ‌ర‌య్యాడు అడ‌వి శేషు. ఈ సంద‌ర్భంగా రీసెంట్ గా సందీప్ ఫ్యామిలీతో క‌లిసి నివాళుల‌ర్పించాడు. కాగా అడివి శేష్‌కి .. సందీప్ తల్లి స్పెషల్ గిఫ్ట్ ని పంపారు. ఈ సంగ‌తిని ట్విట్ట‌ర్ తెలిపాడు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ మదర్ ధనలక్ష్మి ఆంటీ టీషర్ట్ నాకు గిఫ్టుగా ఇచ్చారు. ఈ రోజు ఈ టీషర్ట్‌ను ధరించాన‌ని తెలిపాడు. ఈ సంద‌ర్భంగా టీషర్ట్ వేసుకున్న ఫొటోను కూడా షేర్ చేశాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement