Monday, May 6, 2024

AP: కోడలిని చంపేశారు.. వివాహిత మృతి కేసులో వీడిన మిస్టరీ

ఇచ్ఛాపురం : మండలంలోని కేశుపురం పంచాయితీ నీలాపు పుట్టుగ గ్రామంలో వివాహిత నీలాపు మీనాకుమారి (24) మృతి కేసులో మిస్టరీ వీడింది. ఆమె అత్తమామలే గొంతు నులిమి చంపేసినట్లు తేలింది. ఆ వివరాలను సిఐ ఈశ్వర చంద్ర ప్రసాద్, ఎస్సై కె.గోవింద రావు విలేకరులకు వివరాలు అందజేశారు. మీనా కుమారి భర్త నీలాపు మోహనరావు ఉపాధి రీత్యా పోలెండ్ లో వుంటున్నాడు. 2019లో వివాహం. నలుగురు సంతానం. అక్టోబర్ 7 రాత్రి ఆమె కడుపు నొప్పి తాళలేక ఆత్మహత్యకు పాల్పడిందని 8న ఆమె తల్లి పైల మోహిని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అనుమానాస్పద మృతిగా రూరల్ ఎస్సై రమేష్ కేసు నమోదు చేశారు. ఈనెల 8న విషయం బయట పడుతుందన్న భయంతో ఆమె అత్త మామలు నీలాపు అన్నపూర్ణ, నీలాపు జగ్గారావులు తామే హత్య చేసినట్లు వీఆర్వో శంకరరావు ఎదుట నేరం అంగీకరించినట్లు సిఐ తెలిపారు. వీఆర్వో ఫిర్యాదు మేరకు ఈ కేసును ఇంఛార్జి ఎస్సై కె.గోవిందరావు మార్పు చేసినట్లు తెలిపారు. నిందితులు జగ్గారావు ఆమెను ఎడమ చేతితో గోడకు నెట్టి కుడి చేతితో గొంతు నులిమి చంపినట్లు, ఆ సమయంలో అత్త అన్నపూర్ణ కదలకుండా కాలిపై కూర్చున్నట్లు తమ విచారణలో అంగీకరించారని తెలిపారు.

అనంతరం వారి సమీప బంధువు నీలాపు హేమరాజు సహకారంతో ఆమె ధరించిన డ్రెస్సు తొలగించి నైటీ వేసి సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేశారని సిఐ వివరించారు. ఈ ముగ్గురిపై హత్య కేసు ఇప్పటికే నమోదు చేయగా, అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement