Friday, May 3, 2024

Darsi – బస్సు ప్రమాదంపై జగన్ దిగ్ర్భాంతి – బాధితులను అన్ని విధాల ఆదుకోవాలని ఆదేశం …

అమరావతి – ప్రకాశం జిల్లా దర్శి సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురికావడంపై ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. పొదిలి నుంచి కాకినాడకు పెళ్లిబృందంతో వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి పక్కనే ఉన్న ఎన్‌సీపీ కాల్వలో పడిపోయిందని, ఈ ఘటనలో 7 గురు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు.

ప్రమాదం జరిగిన స్థలానికి పోలీసు సిబ్బంది సహా ఇతర అధికారులు వెళ్లారని, సహాయక చర్యలు చేపట్టారని, క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించిన విషయాన్ని ముఖ్యమంత్రికి వివరించారు. ఈ ఘటనలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు తోడుగా నిలవాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement