Tuesday, May 14, 2024

Counter – పోటీ చేస్తానన్నావ్… తోక ముడిచావు ఏంటి – ప‌వ‌న్ కు ద్వారంపూడి చుర‌క‌లు

కాకినాడ – ఇప్పటివరకు తన మీద పోటీ చేస్తానని పవన్ ప్రకటిస్తారని ఎదురుచూశానని.. కానీ తోక ముడుచుకొని వెళ్లిపోతుడున్నారని ఎద్దేవా చేశా రు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి . ఒక స్ట్రాటజీతో చంద్రబాబు ఇచ్చిన ప్లాన్ ప్రకారం పవన్ తన వారాహి యాత్ర చేస్తున్నారని.. చంద్రబాబు ఆడిస్తే ఇతను ఆడుతున్నారని విమర్శించారు. కాపులు, రెడ్లు కలిసే ఉన్నారన్నారు. చంద్రబాబు చెప్పు చేతల కింద పవన్ పార్టీ ఉందని, కేవలం తనని తిట్టడానికే పవన్ ఇక్కడికి వచ్చారని అన్నారు.

తాను కాకినాడ నుంచి వెళ్లేలోపు పవన్ తన మీద పోటీ చేస్తానని చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే.. తనపై చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నట్లు అనుకుంటానన్నారు. ముద్రగడ ప్రకటన చేయడం చాలా సంతోషమని, తమ కుటుంబం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పారు. ముద్రగడ సలహా తీసుకుని , పవన్ తన మీద పోటీ చేయాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement