Tuesday, May 7, 2024

AP: నివురు గ‌ప్పిన రింగు వ‌ల‌ల వివాదం…సాగ‌ర‌ తీరంలో మళ్లీ అలజడి

విశాఖ తీరంలో మళ్లీ అలజడి మొదలైంది. మత్స్యకార గ్రామాల మధ్య రింగు వలల వివాదం నివురు గప్పింది. ఎన్నికల సీజన్, సున్నితమైన వ్యవహరం కావడంతో పోలీసులు ముందస్తు చర్యలు ప్రారంభించారు.

జాలరి ఎండాడ, వాస వాని పాలెంలో ఆర్మ్డ్ రిజర్వ్ బలగాలను మోహరించారు. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పహారా కొనసాగుతోంది. ఇక్కడ రింగువలల మత్స్యకారులు, సంప్రదాయ జాలర్ల మధ్య కొంత కాలంగా వివాదం నడుస్తోంది.నిషేధిత రింగు వలలతో వేటకు వెళ్లడాన్ని పెద్ద జలరిపేట మత్స్యకారులు వ్యతిరేకిస్తున్నారు. ఈ వేట విధానంలో మత్స్య సంపద వృద్ధికి నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, చట్టబద్ధంగా రింగు వలలకు గతంలో అనుమతులు తీసుకున్నామని.. వాటితో వేట సాగిస్తే మత్స్య సంపద దెబ్బతింటుందనే అభ్యంతరంలో నిజం లేదంటున్నారు జాలరి ఎండాడ ప్రజలు. రాజకీయంగా కూడా ప్రస్తుతం వాతావరణం వేడి ఎక్కుతోంది. ఈ నేపథ్యంలో మత్స్యకార గ్రామాల మధ్య సామరస్య వాతావరణం కోసం పోలీసులు చర్యలు ప్రారంభించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement