Tuesday, April 16, 2024

కానిస్టేబుల్ ఆత్మహత్య

కడప : వైయస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నె మండలం ప్రొఫెసర్స్ కాలనీలోని తన ఇంటిలో 2013 బ్యాచ్ ఏఆర్ కానిస్టేబుల్ బోనాసి రామక్రిష్ణ (31) ఫ్యాన్ కి చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకొన్నాడు. అప్పుల బాధలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు, తోటి స్నేహితులు పేర్కొంటున్నారు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు సంతానం. సికే దీన్నే ఇంచార్జ్ ఎస్సై రాజరాజేశ్వర రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement