Friday, May 10, 2024

Tirupati – మరణించిన కాంగ్రెస్ కు షర్మిలతో దహన సంస్కారం : మంత్రి పెద్దిరెడ్డి

తిరుపతి ( రాయలసీమ ప్రభన్యూస్ బ్యూరో ) : రాష్ట్రంలో రాజకీయంగా ఎప్పుడో మరణించిన కాంగ్రెస్ పార్టీ కి దహన సంస్కారాలు చేయడానికే షర్మిల ను తీసుకువచ్చారని రాష్ట్ర అటవీ, విద్యుత్, భూగర్భ గనుల శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఈరోజు తిరుపతలో ఆయనఅటవీశాఖ కొనుగోలు చేసిన చిత్తూరు సర్కిల్ కు సంబంధించిన 10 వాహనాలకు జెండా ఊపి ప్రారంభించారు.ఆ సందర్బంగా రామచంద్రా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ,అటవీ శాఖ మరింత మెరుగ్గా అటవీ సిబ్బంది పనిచేసేందుకు వాహనాలు అందిస్తున్నామని,ఎర్రచందనం ఉన్న ప్రాంతాల్లో,ఏనుగులు ఎక్కువగా ఉన్న చిత్తూరు, శ్రీకాకుళం లాంటి ప్రాంతాల్లో కూడా వాహనాలు అందిస్తున్నామని చెప్పారు.

వాహనాలు అవశ్యకత తెలుపగానే కొనుగోలుకు అంగీకరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.మీడియా ప్రశ్నలకు జవాబిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చనిపోయిందని,కాంగ్రెస్ దహన సంస్కారాలకోసమే షర్మిలను తీసుకొచ్చారని వ్యాఖ్యానించారు షర్మిల, కెవిపి, రఘువీరా రెడ్డి, గిడుగు రుద్రరాజు కాంగ్రెస్ పాడే మోస్తున్నారని,ఇంకెవరైనా ఒకరు దొరికితే ఉట్టి పట్టుకునేందుకు బాగుంటుందని అన్నారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో అసంతృప్తి గురించి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అసంతృప్తి సహజంగా ఉంటుందన్నారు.ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సరైన పనితీరు కనపరచని వారికి పార్టీ టికెట్ నిరాకరించిందని చెబుతూ వారు అసంతృప్తితో ఉండటం సాధారణమేనని , పార్టీ గెలిచే వారికే టికెట్ ఇవ్వాలని పార్టీదని అన్నారు. చంద్రబాబు, కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా రానున్న ఎన్నికల్లో సిఎం వైఎస్ జగన్ భారీ విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేసారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement