Sunday, April 28, 2024

AP: నేడు ఏపీలో కాంగ్రెస్ ఛలో సెక్రటేరియట్‌…

ఇవాళ ఛ‌లో సెక్ర‌టేరియేట్ పేరిట స‌చివాల‌య మార్చ్ చేప‌ట్టాల‌ని ఏపీ కాంగ్రెస్ పిలుపునిచ్చింది. యువతకు అన్యాయం జరుగుతోందంటూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వైసీపీ ప్రభుత్వానికి వినతిపత్రం అందించాలని భావించాయి. ఇందులో భాగంగా విజ‌య‌వాడ‌కు చేరుకున్న ష‌ర్మిల‌ను ముంద‌స్తుగా పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. దీనిని ష‌ర్మిల ఖండిస్తూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

అయితే ఛలో సెక్రటేరియట్ నేపథ్యంలో పోలీసులు కాంగ్రెస్ నేతలను హౌస్ అరెస్టులు చేస్తున్నారు. కాగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విజయవాడ చేరుకున్నారు. ప్రస్తుతం ఆమె పార్టీ కార్యాలయంలోనే ఉన్నారు.

వాస్తవానికి ఆమె కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ నివాసంలో బస చేయాల్సి ఉంది. హౌస్ అరెస్టుల నేపథ్యంలో ఆమె పార్టీ కార్యాలయంలోనే ఉన్నారు. అయితే కాంగ్రెస్ నేతల హౌస్ అరెస్టులపై వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. నిరుద్యోగుల పక్షాన పోరాటానికి పిలుపునిస్తే హౌస్ అరెస్టులు చేయాలని చూస్తారా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు లేదా అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేశారు. తమను ఆపాలని చూసినా, కార్యకర్తలను నిలువరించినా, బారికేడ్లతో బంధించాలని చూసినా నిరుద్యోగుల పక్షాన పోరాటం ఆపేది లేదన్నారు షర్మిల.

Advertisement

తాజా వార్తలు

Advertisement