Friday, May 3, 2024

Delhi: ఏపీలో 1,922 పరపతి సంఘాల కంప్యూటరీకరణ.. కేంద్ర మంత్రి అమిత్ షా వెల్లడి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: రానున్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లోని 1,922 ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘాలను కంప్యూటరీకరణ చేయనున్నట్లు సహకార శాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. రాజ్యసభలో బుధవారం విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఈ విషయం చెప్పారు. కంప్యూటరీకరణ ద్వారా దేశంలోని 63 వేల ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘాల సామర్థ్యాన్ని పెంపొందించి, వివిధ రకాల సేవలు అందుబాటులోకి తేవడం, పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావడం కంప్యూటరైజేషన్‌ ముఖ్య ఉద్దేశమని ఆయన అన్నారు. రాష్ట్ర సహకార బ్యాంక్‌ల జాతీయ సమాఖ్య (నాప్స్‌కాబ్‌) లెక్కల ప్రకారం 2019-20 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో 1,992 ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఉన్నాయని వెల్లడించారు. అన్ని సంఘాలలో ఇప్పటికే నాబార్డ్ సర్వే చేసిందని, వాటన్నింటినీ కంప్యూటరీకరణ ఎలా చేయాలన్న విషయంపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement