Wednesday, May 15, 2024

క‌లెక్ట‌ర్ సీరియ‌స్‌.. ఆర్డబ్ల్యుఎస్ ఎస్ఈకి షోకాజ్ నోటీసు, మరో నలుగురికి సస్పెన్షన్స్ ఉత్తర్వులు

శ్రీకాకుళం, (ప్రభన్యూస్​) : ఇంటింటికి కుళాయి కనెక్షన్ల పనులను ఏపీ ప్రభుత్వం సీరియస్​గా తీసుకుంటుంది. అయితే.. ఈ పనులు చేయడంలోనూ, పనితీరులో వెనుకబడినందుకు శ్రీకాకుళం ఆర్​డబ్ల్యూఎస్​ ఎస్​ఈకి కలెక్టర్ శ్రీకేష్​ లాఠకర్​​ షోకాజ్ నోటీసు జారీ చేశారు. అంతేకాకుండా పలాస, ఎచ్చెర్ల డీఈలతోపాటు వజ్రపుకొత్తూరు, పలాస ఎఈలకు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేయాలని ఆర్డబ్ల్యుఎస్ ఎస్ఈ ప్రసాదరావును కలెక్టర్​ ఆదేశించారు. శానిటరీ కాంప్లెక్స్ పనులు పునాది దశలోనే ఉన్నాయని, ఆ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.​శానిటరీ కాంప్లెక్స్ నిర్మాణాల్లో పూర్ పెర్ఫార్మెన్స్ ఉన్నందున ఎచ్చెర్ల, మందస మండలాల ఏఈలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఎస్ఈ ని ఆదేశించారు.

ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు ఇచ్చే పనులు వేగవంతం చేయాలని ఇంజనీర్లను కలెక్టర్​ ఆదేశించారు. ఇవ్వాల కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆర్డబ్ల్యుఎస్ డీఈ, ఏఈలతో ఇంటింటికి కుళాయి కనెక్షన్లు, శానిటరీ కాంప్లెక్స్ నిర్మాణాలు, తదితర వాటిపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ అవసరమైతే ఇంజనీరింగ్ అసిస్టెంట్లను వినియోగించుకోవాలని ఆదేశించారు. ఎన్ని కుళాయి కనెక్షన్లు పూర్తి చేశారనే అంశంపై మండలాల వారీగా సమీక్షించారు. జిల్లాలో ఇంటింటి కుళాయి కనెక్షన్లు 3 లక్షలు లక్ష్యంగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement