Saturday, May 18, 2024

సహజ మరణాలను కూడా వక్రీకరిస్తున్నారు: జంగారెడ్డి గూడెం మరణాలపై సీఎం వివరణ 

జంగారెడ్డిగూడెం మరణాలపై టీడీపీ చేస్తోన్న తీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో జంగారెడ్డి గూడెం మరణాలపై సీఎం మాట్లాడారు. సహజ మరణాలను టీడీపీ రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. కల్తీ మద్యం మరణాలు గతంలోనే అనేక సార్లు జరిగాయి. కల్తీ మద్యాన్ని తమ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేస్తోందని.. రాష్ట్రంలో బెల్ట్‌ షాపులను సమూలంగా నిర్మూలించామన్నారు. 

సాధారణ బడ్జెట్‌ మీద చర్చ ప్రారంభం కాబోతున్న తరుణంలో తెలుగుదేశం శాసనసభ్యులు ఇంకా మా పంథా మాదే అన్నట్టుగా నిరసన తెలుపుతూ, అల్లరి చేస్తూ, గొడవలు చేస్తూ వారి కార్యక్రమాన్ని  వారు కొనసాగిస్తున్నారని ఆగ్రహించారు. జంగారెడ్డి గూడెంలో జరిగిన విషయాల గురించి, అక్కడి పరిస్థితులు గురించి ఉపముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్యశాఖ) ఆళ్ల నాని ఇంతకముందు సుదీర్ఘంగా చెప్పారని తెలిపారు. సాధారణ బడ్జెట్‌ మీద చర్చ ప్రారంభం కాబోతుంది. గౌరవ తెలుగుదేశం శాసనసభ్యులు ఇంకా మా పంథా మాదే అన్నట్టుగా నిరసన తెలుపుతూ, అల్లరి చేస్తూ, గొడవలు చేస్తూ వారి కార్యక్రమాన్ని  వారు కొనసాగిస్తున్నారు. జంగారెడ్డి గూడెంలో జరిగిన విషయాల గురించి, అక్కడి పరిస్థితులు గురించి ఉపముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్యశాఖ) ఆళ్ల నాని ఇంతకముందు సుదీర్ఘంగా చెప్పారు.

దేశవ్యాప్తంగా,రాష్ట్ర వ్యాప్తంగా మరణాల సంఖ్య అంచనా 2 శాతం డెత్‌రేటు వేసుకున్నా.. కనీసం 90 మంది సహజంగానే అనారోగ్యం వల్ల, వయోభారం వల్ల, ప్రమాదాలు వల్ల కానీ చనిపోవటం అనేది ఎక్కడైనా జరుగుతుందన్నారు. అలాంటిది ఈ మాదిరిగా సహజ మరణాలను కూడా వక్రీకరించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కల్తీ మద్యం తయారు చేసే వాళ్లను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సపోర్టు చేస్తుంది అని సీఎం ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో గతంలో అక్రమ మద్యం తయారీ జరిగిందని తెలిపారు. ఇప్పుడు కొత్తగా జరిగిందీ కాదన్నారు. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(ఎస్‌ఈబీ) అనే ప్రత్యేకమైన పోలీస్‌ ఫోర్స్‌ను తీసుకొచ్చాం అని తెలిపారు. ఎక్కడైనా ఇటువంటి కార్యక్రమాలు జరిగితే ఉక్కుపాదంతో అణిచివేయమని పూర్తి ఆదేశాలు ఇచ్చామని గుర్తు చేశారు. ఎక్కడా ఉపేక్షించాల్సిన అవసరం లేదని చాలా స్పష్టమైన సంకేతాలు ఇచ్చామని తెలిపారు.  

మద్యం వినియోగాన్ని తగ్గించాలనే ఉద్దేశ్యంతో అధికారంలోకి వచ్చిన వెంటనే 43 వేల బెల్టు షాపులను పూర్తిగా లేకుండా చేశామని సీఎంజగన్ తెలిపారు. చంద్రబాబు హయాంలో 43వేల బెల్టుషాపులు రాష్ట్రంలో ప్రబలి ఉంటే వాటిని పూర్తిగా రద్దు చేశాం. అంతే కాకుండా 4380 మద్యం షాపులు ఉండేవి. ఈ 4380 మద్యం షాపులు పక్కనే పర్మిట్‌ రూమ్‌లు అని అనుమతి ఇచ్చారని ఆరోపించారు. తమ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా పర్మిట్‌ రూమ్‌లను రద్దు చేశామన్నారు.  

గతంలో లాభ ఆపేక్షతో మద్యాన్ని విచ్చలవిడిగా బెల్టుషాపుల ద్వారా అమ్మే కార్యక్రమం జరిగేదని, విచ్చలవిడిగా మద్యం ప్రతి బడి పక్కన, ప్రతి గుడి పక్కన గ్రామంలో ఎక్కడ బడితే అక్కడే దొరికే పరిస్థితి ఉండేదని చెప్పారు. ఇవన్నీ కూడా పూర్తిగా పోయి, లాభ ఆపేక్ష ఉంటే ఏనాటికైనా వీటిని ఆపలేమనే ఉద్దేశ్యంతో… ప్రభుత్వమే రంగ ప్రవేశం చేసి మద్యం షాపులన్నీ ప్రభుత్వమే నడిపే కార్యక్రమం చేస్తుందన్నారు. గతంలో రాత్రి 12గంటలు, ఒంటి గంట వరకు కూడా మద్యం షాపులు తెరిచి ఇష్టమొచ్చినట్లు తాగించే పరిస్థితి అని, ఎక్కడ కావాలంటే అక్కడే మద్యం దొరికేదన్నారు. ఆ పరిస్థితులను పూర్తిగా మార్చివేసి, నిర్ణీత కాలపరిమితిలో, నిర్ణీత సమయాల్లో మాత్రమే మద్యం అందుబాటులో ఉండే పరిస్థితిని ఇవాళ తీసుకొచ్చాం అని వివరించారు.

- Advertisement -

తమ ప్రభుత్వ చర్యలతో పాటు షాక్‌ కొట్టే విధంగా రేట్లు తీసుకొచ్చాం. దీనివల్ల మద్యం వినియోగం తగ్గిందని తెలిపారు. మద్యం వినియోగం తగ్గినా ఈ రకంగా రేట్లు ఎక్కువగా పెట్టడం వల్ల, అక్రమ మద్యంకు ఎక్కువ అవకాశం వస్తుందని చెప్పారు. ఈ ధరలు తగ్గిస్తేనే అక్రమ మద్యాన్ని తగ్గించగలుగుతామని ఎస్‌ఈబీ నివేదిక దగ్గర నుంచి అందరూ, ప్రతిపక్షపార్టీల సహా అందరూ చెప్పడం మొదలుపెట్టేసరికి…. దాన్ని కూడా మంచి ఉద్దేశ్యంతో తీసుకుని మరలా ధరలు కూడా తగ్గించాం అని పేర్కొన్నారు. కల్తీ మద్యం తయారు చేసే వాళ్లను రక్షించాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ఎవరైనా అటువంటి కల్తీ మద్యం చేస్తుంటే… వాళ్లను ఉక్కుపాదంతో అణిచివేయమని స్పష్టమైన ఆదేశాలు ఎస్‌ఈబీకు ఉన్నాయని చెప్పారు. సహజమరణాలను కూడా అక్రమ మద్యం వల్ల చనిపోయినట్టుగా భ్రమకల్పిస్తూ… నానారకాలుగా యాగీ చేస్తున్నారని సీఎం జగన్ మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement