Saturday, May 4, 2024

AP : వినుకొండలో సీఎం జగన్ బస్సు యాత్ర

సీఎం జగన్‌ మేమంతా సిద్ధం 11వ రోజు కొనసాగనుంది. ఇవాళ వినుకొండలో జగన్ పర్యటించనున్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా వినుకొండ నియోజకవర్గంకు చేరుకోనున్న ఆయన శివయ్య స్తూపం వద్ద వైసిపి ఆద్వర్యం లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు.

- Advertisement -

ఉదయం 9:30 గంటలకి వెంకటాచలంపల్లి దగ్గర సామజిక పింఛన్ లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. బొదనంపాడు, కురిచేడు, చింతల చెరువు మీదుగా వినుకొండ అడ్డరోడ్ వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. చీకటిగల పాలెం మీదుగా వినుకొండ 3 గంటలకు చేరుకుని రోడ్ షో కార్యక్రమంలో పాల్గొంటారు. కనమర్లపూడి, శావల్యాపురం మీదుగా గంటావారిపాలెం రాత్రి బసకు చేరుకుంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement