Thursday, April 25, 2024

ఎమ్మెల్యే మల్లాది విష్ణు కుమారై వివాహానికి హాజరైన.. సీఎం జగన్

సీఎం జగన్ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కుమారై ..డాక్టర్ లలిత నాగదుర్గ వివాహానికి హాజరైయ్యారు. మంగళగిరి సీకే కన్వెన్షన్స్ లో ఈ వివాహం ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు సీఎం జగన్ హాజరయిన సీఎం జగన్ కు మల్లాది విష్ణు, ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. వివాహ మండపం వద్దకు చేరుకున్న సీఎం జగన్ వధూవరులు డాక్టర్ లలిత నాగదుర్గ, డాక్టర్ సాయి సూర్యతేజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. వారికి ఆశీస్సులు అందజేశారు. ఈ వివాహానికి మంత్రి జోగి రమేశ్, ఇతర వైసీపీ నేతలు కూడా హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement