Thursday, April 25, 2024

వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు పోరాడుతాం: సిఐటియు

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో రైతు సంఘాల సమన్వయ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు భారత్ బంద్ సిఐటియు ఎఐటియుసి ఆధ్వర్యంలో సిఐటియు మండల అధ్యక్షులు రాజు అధ్యక్షతన నిర్వహించారు. బంద్ కార్యక్రమాన్ని ఉద్దేశించి డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్, ఏఐటియుసి మండల కార్యదర్శి మాధవ స్వామి, సిఐటియు మండల కార్యదర్శి రామానాయుడు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రైతులు 11 నెలల నుంచి రైతు వ్యతిరేక చట్టాలను రద్దు కోరుతూ మరియు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర చట్టం చేయాలని పోరాడుతున్న కార్మికులు సాధించుకున్న నలబై నాలుగు రకాల హక్కులను నాలుగు కార్మిక కోడ్స్ గా మార్చడం వల్ల కార్మికులకు ఉన్నటువంటి హక్కుల యొక్క సారం తగ్గిపోయిందని కావున కార్మిక కోడ్స్ ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

విద్యుత్ సవరణ చట్టం 2020 నీ రద్దు చేయాలని, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆపాలని, బ్యాంకులు రైల్వే ఇన్సూరెన్స్ ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేశారు. కొత్తగా కేంద్ర ప్రభుత్వం నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ పేరుతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆస్తులను ఖాళీ స్థలాలను కార్పొరేట్ ప్రైవేట్ సంస్థలకు కారుచౌకగా కట్టబెట్టి ఆరు లక్షల కోట్ల రూపాయలను సమకూర్చుకుం అని ప్రకటించడం దుర్మార్గమైన అంశం అని తెలియజేశారు. ప్రభుత్వానికి ఆర్థికంగా వనరులు కావాలంటే కొత్త పరిశ్రమలు పెట్టి లేదా కార్పొరేట్ కంపెనీల నుండి పన్నులు వేసి వనరులు సమకూర్చుకోవాలి తప్ప ప్రజల కష్టం తో నిర్మించిన ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ వాళ్లకు అప్పజెప్పడం సరైంది కాదని అన్నారు. కరోనా వచ్చి గత రెండు సంవత్సరాల నుండి యావత్ ప్రజానీకం పనుల్లేక ఆర్ధిక ఇబ్బందులలో ఉంటే ఆదుకోవాల్సిన ప్రభుత్వం పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలు నిత్యావసర వస్తువుల ధరలు పెంచి వారి పై మరిన్ని భారాలు మోపింది కావున తక్షణమే పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement