Thursday, October 31, 2024

ప్రతి ఇంట తిరుపతి ఆవిర్భావ దినోత్సవం.. భూమ‌న

తిరుపతి సిటీ : ప్ర‌తి ఇంట తిరుప‌తి ఆవిర్భా దినోత్స‌వాన్ని జ‌రుపుకుందామ‌ని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల వెంకటేశ్వర స్వామి పాదాల చెంత చరిత్ర పుటలలో లిఖించబడిన కొత్తూరు (కోటపల్లి) నామాలతో మార్పు చెంది చివరకు తిరుపతిగా ఫిబ్రవరి 24వ తేదీ 1130వ సంవత్సరం ఆవిర్భవించిందని ఎమ్మెల్యే భూమన గత తిరుపతి చరిత్రను ఒకసారి గుర్తు చేశారు. మంగళవారం స్థానిక సింధూరి హోటల్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భూమన మాట్లాడుతూ… ఈ పండుగను తిరుపతి నగరంలోని ప్రతి ఇంట జరుపుకోవాలని పిలుపునిచ్చారు. 893వ జన్మదినోత్సవాలను అందరూ కలిసి ఆనందంగా జరుపుకుందామన్నారు.

ఆ కాలంలో శ్రీవారి ఆలయం కూడా తిరుచానూరులో ఉండేదని, బ్రహ్మోత్సవాలన్నీ అక్కడే జరిగేవని, గత చరిత్ర పుటల్లోని తాళ్ల పత్రాలలోని విషయాలను తెలిపారు. భగవత్ రామానుజులు తిరుపతి పట్టణ ఆవిర్భావానికి కారకులని, అందులో భాగంగానే గోవిందరాజ పట్టణం వెలసిందని తెలిపారు. 13వ శతాబ్దం కాలం నుండి తిరుపతిగా ప్రసిద్ధిగాంచిందని, నాటినుండి నేటి వరకు తిరుపతి విశ్వ వ్యాప్తమైందని కొనియాడారు. ఈ విలేకరుల సమావేశంలో నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, ఉపమేయర్ ముద్ర నారాయణ, ఎస్కే బాబు, ప్రముఖ రచయితలు శైల కుమార్, శాకం నాగరాజు, వెంకటేష్ లతోపాటు నగర కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement