Tuesday, April 30, 2024

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొండంత..

క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవ‌మైన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి వారిని ద‌ర్శించుకునేందుకు తిరుమ‌ల‌కు భ‌క్తులు పోటెత్తారు. ఆదివారం సెల‌వు దినం కావ‌డంతో భక్తులు ర‌ద్దీ పెరిగింది. భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తిరుమల పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. వీరికి 20 గంటల్లో దర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 84,878 మంది భక్తులు దర్శించుకోగా 41,016 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.86 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement