Tuesday, April 23, 2024

స్వీట్ షాపులో అగ్ని ప్ర‌మాదం.. త‌ప్పిన పెను ప్ర‌మాదం..

అన‌కాప‌ల్లి జిల్లా య‌ల‌మంచిలిలో అగ్ని ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఓ స్వీట్ షాపులో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. వెంట‌నే పోలీసులు, ఫైర్ సిబ్బందికి స్థానికులు స‌మాచారం అందించారు. హుటాహుటిన ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంట‌ల‌ను అదుపు చేశారు. పెను ప్ర‌మాదం త‌ప్ప‌డంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌పై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement