Friday, May 17, 2024

తిరుప‌తిలో బిజెపి వ్యూహం – సామాజిక అస్త్రం..

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా బరిలోకి దిగిన బీజేపీ సోషల్‌ ఇంజనీరింగ్‌ (సామాజిక సమీకరణ)పై ప్రత్యేక దృష్టిసారించింది. కులాల వారీగా ఓట్లను ఆకర్షించేందుకు పకడ్బందీ ప్రణాళి కలు రూపొందిస్తోంది. ఇప్పటికే తిరుపతి అభివృద్ధికి పెద్దపీట వేసినట్లు పేర్కొంటు న్న బీజేపీ.. ఇక సామాజిక వర్గాల వారీగా తాము అమలు చేసిన, చేయబోయే కార్యక్రమాలను ఆయా వర్గాల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు వ్యూహరచన చేస్తోంది. ఇప్పటికే కులాల వారీగా ఓటర్ల వివరాలను బీజేపీ నేతలు సేకరిస్తున్నట్లు తెలిసింది. రెండు మూడు రోజుల్లో జాబితాను సిద్ధం చేసుకొని సామాజి క వర్గాల వారిగా ఓటర్లను ఆకర్షించేందుకు వ్యూహ రచన చేస్తున్నారు. దక్షిణాదిలో కాలు మోపేందుకు ఏపీ ముఖ ద్వారంగా బీజేపీ తొలి నుంచి చెపుతోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఇదే అంశంపై ఒంటరి పోరు కు సిద్ధమైనప్పటికీ..సామాజిక సమీకరణాలు, అభ్య ర్థుల ఎంపికలో వెనుకబడట వల్లనే ఆశించిన ఫలితా లు రాలేదని బీజేపీ భావిస్తోంది. దీనిని దృష్టిలో ఉంచు కొని తిరుపతి ఉప ఎన్నికల్లో సామాజిక వర్గాల సమీక రణపై బీజేపీ నేతలు ప్రత్యేకంగా దృష్టిసారించారు. ఇందులో భాగంగా బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి గా ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన రిటైర్డు ఐఎఎస్‌ అధికారి రత్నప్రభను అభ్యర్థిగా బరిలోకి దిం చారు. అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులనే బరిలోకి దించడంతో సామాజిక సమీకరణాల్లో భాగంగా ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి ప్రాధాన్య త ఇచ్చినట్లు పార్టీ నేతలు చెపుతున్నారు. ఇదే సమ యంలో తాము తొలి నుంచి కూడా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నట్లు చెపుతూ గతంలో కేంద్రమం త్రిగా ఉన్న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌ రెడ్డి బహి రంగ మద్దతు ప్రకటించిన విషయాన్ని ప్రధానంగా ప్రచారం చేస్తున్నారు. తద్వారా రాష్ట్ర విభజన తర్వాత తమ సామాజిక వర్గానికి ప్రాధాన్యత లేదని భావిస్తు న్న మాలల ఓట్లను రాబట్టుకునే వ్యూహంలో బీజేపీ నేతలు ఉన్నారు.
ఆ ప్రకటన వెనుక ఆంతర్యమిదే: తిరుపతి ఉప ఎన్నికల్లో కాపు(బలిజ) సామాజిక వర్గం బలంగా ఉన్నట్లు బీజేపీ నేతలు చెపుతున్నారు. బలిజ సామాజి క వర్గానికి చెందిన ఓట్లను దృష్టిలో ఉంచుకొని రాను న్న రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అంటూ ప్రచారంలోకి తెచ్చారు. గతం లో సినీ హీరో చిరంజీవి, ఎంవీ రమణ, ఎం. సుగుణ మ్మ తదితరులు ఆ సామాజిక వర్గం నుంచి గెలుపొం దిన వారేనని చెపుతున్నారు. ఇదే క్రమంలో తిరుపతి పార్లమెంటు పరిధిలో గణనీయమైన సంఖ్యలో ఉన్న వీరి మద్దతు కూడగట్టిన పక్షంలో గెలుపు అవకాశాలు మెరుగవుతాయని చెపుతున్నారు. ఈ క్రమంలోనే సోము వీర్రాజు, జీవీఎల్‌ నరసింహారావు తదితరుల ద్వారా ఆ ప్రకటన చేయించడం ద్వారా కాపు సామా జిక వర్గం ఓటర్లను ఆకర్షించను న్నట్లు తెలుస్తోంది. ఈ నెల 3 నుంచి పవన్‌ కళ్యాణ్‌ పర్యటన కూడా ఇందులో భాగమేనని చెప్పొచ్చు. పవన్‌ కళ్యాణ్‌ పర్యటన తర్వాత పార్టీ పరంగా గెలుపు అవకాశాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నట్లు బీజేపీ నేతలు భావిస్తున్నారు.
మరికొన్ని సామాజిక సమీకరణలు : గత కొన్నేళ్లు గా రాష్ట్రంలోని కొన్ని సామాజిక వర్గాలు ఎస్టీ, ఎస్సీ జాబితాలో చోటు కోసం ఆందోళన చేస్తున్నాయి. ముఖ్యంగా బోయ సామాజిక వర్గం ఎస్టీల్లో చేర్చాల ని కోరుతుండగా. .రజక సామాజిక వర్గం ఎస్సీల్లో చేర్చాలని కోరుతోంది. గతంలో పలు ప్రభుత్వాలు హామీలు ఇచ్చినప్పటికీ సాంకేతిక సమస్యలను దృష్టి లో ఉంచుకొని పక్కనబెట్టాయి. అయితే ఆయా వర్గా లు కోరిన విధంగా రిజర్వేషన్‌ కేటగిరీ మార్పు కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వ పరిధి కాదనే అంశాన్ని ప్రచారం చేయనున్నట్లు తెలిసింది. బీజేపీ అభ్యర్థిని గెలిపించిన పక్షంలో ఇందుకోసం ప్రయత్నిస్తామంటూ ప్రచారం చేయ డం ద్వారా ఆయా వర్గాల ఓట్లను ఆకర్షించే ప్రయత్నా లు జరుగుతున్నాయి.
మేమే ఇచ్చాం : విద్య, ఉద్యోగాల్లో ఆర్థికంగా వెనుక బడిన అగ్రవర్గ పేదలకు ఈబీసీ రిజర్వేషన్‌ అమలు చేస్తున్న విషయాన్ని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇవ్వడం వలనే ఆ రిజర్వేషన్‌ వచ్చినట్లు పేర్కొంటూ అగ్రవర్ణ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు బీజేపీ నేతలు చేయనున్నట్లు తెలిసింది. తద్వారా అన్ని సామాజిక వర్గాలను సమీకరించుకొని తిరుపతి నియజకవర్గం ద్వారా పార్లమెంటులో పాగా వేసేందుకు బీజేపీ నేతలు పావులు కదుపుతున్న ట్లు తెలుస్తోంది.
-దారం వెంక‌టేశ్వ‌ర‌రావు, అమ‌రావ‌తి బ్యూరో,

Advertisement

తాజా వార్తలు

Advertisement