Monday, April 29, 2024

AP: చిరంజీవే మా సీఎం అభ్య‌ర్థి… తిరుప‌తి నుంచి పోటీకి ఆహ్వానిస్తాం… చింతా మోహ‌న్‌

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవే త‌మ సీఎం అభ్య‌ర్థి అని.. తిరుప‌తి నుంచి పోటీకి చిరంజీవిని ఆహ్వానిస్తామ‌ని ఆయ‌న అన్నారు. అక్కడినుంచి పోటీ చేస్తే చిరంజీవి సీఎం కావడం పక్కా అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం పక్కా అని కీలక వ్యాఖ్యలు చేశారు.

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 130 సీట్లు, లోక్‌సభ ఎన్నికల్లో 20 సీట్లు గెలుస్తామని జోస్యం చెప్పారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని చెప్పారు. కాపులకు ఇదే మంచి అవకాశం అని సూచించారు. చిరంజీవి పోటీకి దిగితే 50 వేల పైచిలుకు మెజార్టీతో గెలిపిస్తామని చెప్పారు. రాజకీయాల్లో రీఎంట్రీపై, వచ్చే ఎన్నికల్లో పోటీ వెంటనే చిరంజీవి ఓ నిర్ణయం తీసుకుంటే ఏపీపై అధికారం చేజిక్కించుకోవడం సులభం అవుతుందన్నారు.

వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమిలో భాగంగా ఉన్న అన్ని పార్టీలతో కలిసి పోటీ చేస్తామని తెలిపారు. కాకినాడ లోక్‌సభ నుంచి సీపీఐఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, నగరి అసెంబ్లీ స్థానం నుంచి సీపీఐ నారాయణ పోటీ చేయాలని కోరారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement