Thursday, May 2, 2024

AP | నీటి ముంపులో చింతూరు మన్యం.. పరుగులు పెడుతున్న శబరి

చింతూరు, (ప్రభన్యూస్): అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చింతూరు మన్యంలోని శబరి నది క్రమేపి పెరుగుతోంది. శబరి నదికి అనుసంధానమైన వాగులు, వంకలు సోకిలేరు, కుయుగూరు, అత్తకోడళ్లు, చంద్రవంక వాగులు సైతం పొంగి ప్రవహిస్తున్నాయి. చుటూరు – ముకునూరు గ్రామాల మధ్య ఉన్న సోకిలేరు వాగు పొంగి చింతూరు – వీఆర్‌ పురం మండలాలతో పాటు పలు గిరిజన గ్రామాలకు, కుమ్మూరు గ్రామ పంచాయతీ పరిధిలోని చంద్రవంక వాగు పొంగి ప్రవహిస్తోంది.

దీంతో వరద నీరు రోడ్లపైకి చేరడంతో కుమ్మూరు పంచాయతీలోని పలు గ్రామాలకు, చదలవాడ పంచాయతీ పరిధిలోని గిరిజనుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అంతేకాకుండా అంతర్రాష్ట్ర రాకపోకలకు సైతం అంతరాయం ఏర్పడింది. ఆంధ్రా – ఒడిశా రాష్ట్రాల మధ్య గల కుయుగూరు వాగు పొంగి జాతీయ రహదారిని ముంచెత్తింది. ఈ క్రమంలో ఒడిశా – ఆంధ్రా రాష్ట్రాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement