Thursday, May 2, 2024

సుబ్ర‌మణ్యం భార్య‌ను ఫోన్ లో ప‌రామ‌ర్శించిన చంద్ర‌బాబు

వైసీపీ ఎమ్మెల్సీ అనంత‌బాబు కారు డ్రైవ‌ర్ సుబ్ర‌మ‌ణ్యం భార్య‌ను తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు ఫోన్ లో ప‌రామ‌ర్శించారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కారులో మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం శవమై కనిపించడం తీవ్ర కలకలం రేపింది. సుబ్రహ్మణ్యం మృతదేహానికి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం ఈరోజు స్వగ్రామం గొల్లలమామిడాడలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈసంద‌ర్భంగా చంద్ర‌బాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం భార్య అపర్ణను ఫోన్ ద్వారా పరామర్శించారు. బహిరంగంగా తిరుగుతున్న ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అపర్ణకు టీడీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితులకు శిక్ష పడేవరకు టీడీపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement